ప్రదీప్ కు పవన్ నుంచి ఊహించని సపోర్ట్ !
మంచి టైమింగ్ తో పంచ్ లు వేస్తూ తన వాక్ చాతుర్యంతో తను హోస్ట్ చేసే షోలకు మంచి రేటింగ్స్ వచ్చేలా ప్రదీప్ హోస్టింగ్ ఉంటుంది. అదుర్స్ – నర్తనశాల - కిక్ - డ్రామా జూనియర్స్ – ఢీ - సరిగమప వంటి షోలకు మంచి రేటింగ్స్ రావడంలో ప్రదీప్ యాంకరింగ్ చాల కీలక పాత్ర వహించింది.
లేటెస్ట్ గా ప్రదీప్ నటించిన ‘30 రోజులలో ప్రేమించడం ఎలా’ మూవీకి సరైన టాక్ రాకపోయినప్పటికీ ఈ మూవీకి సుమారు 4 కోట్ల వరకు కలక్షన్స్ రావడం కేవలం ప్రదీప్ ఇమేజ్ వల్లనే జరిగింది అని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఊహించిన విజయం అందుకోలేకపోవడంతో కొంతవరకు డల్ గా మారిన ప్రదీప్ కు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట అతడికి జోష్ ను కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు ప్రదీప్ తన సక్సస్ ఫుల్ షో ‘కొంచెం టచ్లో ఉంటే చెప్తా' 5వ సీజన్ ను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 5వ సీజన్ మొదటి ఎపిసోడ్ కు పవన్ కళ్యాణ్ అతిధిగా రావడానికి అంగీకరించాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రదీప్ మీడియా వర్గాలకు చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో పవన్ ‘అత్తారింటికి దారేది’ లో ప్రదీప్ ఒక చిన్న పాత్రలో నటించాడు. అప్పటి నుండి ప్రదీప్ కు పవన్ తో చిన్నపాటి సాన్నిహిత్యం కొనసాగుతోందని తెలుస్తోంది. ఆ పరిచయంతోనే ఈ షోకు సంబంధించి పవన్ అడగడం పవర్ స్టార్ అంగీకరించడం జరిగింది అని అంటున్నారు. తాను హీరోగా నటించిన తొలి సినిమా ఫెయిల్ అయినప్పటికీ ఇప్పుడు తాను హోస్ట్ చేస్తున్న షోకు పవన్ అతిధిగా వస్తూ ఉండటంతో ప్రదీప్ ఆనందానికి హద్దులు లేవు..