అంతరిక్షంలో గర్భందాల్చిన మొట్టమొదటి ప్రాణి ఏదో తెలుసా..?
ఇక సాయికుమార్ తనదైన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రతి వారం నలుగురు సెలబ్రిటీలను ఈ షోలో గెస్ట్లుగా పిలిచి ఇక వారితో ఫన్నీ టాస్క్ లు ఆడిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు నటుడు సాయి కుమార్. ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఎవరికీ తెలియని ఎన్నో ప్రశ్నలు అడుగుతు అందరికీ జనరల్ నాలెడ్జ్ కూడా పెంచుతున్నారు. ఇలా ఓ వైపు జనరల్ నాలెడ్జ్ పెంచడంతో పాటు మరోవైపు ఎంటర్టైన్మెంట్ తో కూడా వావ్ అనిపిస్తుంది.
అయితే వచ్చేవారం ఎపిసోడ్ కి సంబంధించి ఇటీవలే విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక వచ్చే వారం ఎపిసోడ్ కి బుల్లితెరపై ఎన్నో ధారావాహికల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న బుల్లితెర ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటులు గెస్ట్ లుగా వచ్చారు. అనిల్, అంకిత, అనుశ్రీ, కళ్యాణ్ నలుగురు కూడా వావ్ షో కి గెస్ట్ గా వచ్చారు. ఈ క్రమంలోనే వీరిని ఫన్నీ ఫన్నీ ప్రశ్నలు అడిగి అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచారు వ్యాఖ్యత సాయికుమార్. ఈ క్రమంలోనే అంతరిక్షంలో గర్భందాల్చిన మొట్టమొదటి ప్రాణి ఏది అంటూ ప్రశ్న అడగడం తో అందరూ తెల్లమొహం వేసారు. ఈ ప్రోమో చూస్తున్న ప్రేక్షకులకు కూడా అది తెలుసుకోవాలి అనే ఆతృత కలిగింది. అది ఏంటో తెలియాలంటే మాత్రం మొత్తం ఎపిసోడ్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.