ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

frame ఉప్పెన ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది కాని.. అతని గొంతు మాత్రం ఆకట్టుకోవట్లేదు...!!

Purushottham Vinay

ఇండియాహెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ "ఉప్పెన"సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పాటలకు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది.ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందరి అంచనాలకి తగ్గట్లుగానే సినిమా ఉంటుందని ట్రైలర్ లో చూపించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ప్రేమంటే రోమియో జూలియట్ లా, లైలా మజ్నులా, దేవదాస్ పార్వతిల్లా అదో మాదిరిగా ఉండాలిరా.. అంటూ హీరో చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయ్యింది ఈ ట్రైలర్. విజయ్ సేతుపతి విలనిజం, హీరోయిన్ గ్లామర్ రెండూ కూడా ట్రైలర్ లో హైలెట్ అనే చెప్పాలి.

ప్రేమించుకున్న జంటని హీరోయిన్ తండ్రి ఎలా విడదీశాడు..? ఏం చేశాడు..? హీరో విలన్ ఇద్దరి మద్యలో జరిగిన సంఘటనలు ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా వెండితెరపై ఉండబోతోందని ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. హీరో – హీరోయిన్ – విలన్ ల మధ్యన జరిగే హై డ్రామా ట్రైలర్ లో చూపించారు. అంతేకాదు, ప్రేమంటే పట్టుకోవడం నాన్నా, వదిలేయడం కాదు అనే డైలాగ్, ఆకాశం సముద్రం కలుస్తాయా అని విలన్ అడుగుతుంటే అల ఎంత ఎగిరినా కలవవు అని చెప్పే సమాధానం , అయితే ఆకాశం వంగితే అని విలన్ చెప్పే కౌంటర్ డైలాగ్ బాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.హీరోగా వైష్ణవ్ తేజ్ చాలా డీగ్లామర్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నా కూడా కంటెంట్ మొత్తం హీరోతోనే నడుస్తోంది. అలాగే, హీరోయిన్ అందాలు, విజయ్ సేతుపతి చూపించిన విలనిజం బాగానే వుంది కాని విజయ్ సేతుపతి గొంతు అంతగా బాగోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదల కాబోతుంది...ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: