బాలీవుడ్ ని షేక్ చేస్తున్న విజయ్ సేతుపతి...భారీ డిమాండ్...?

VAMSI
అదిరిపోయే స్టైల్, పవర్ ఫుల్ డైలాగ్స్, మంచి కామెడీ టైమింగ్, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోగల నటన ఆ హీరో సొంతం. అతడే తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి. ఎంతో సాధారణమైన వ్యక్తిగా సినీ జీవితాన్ని మొదలు పెట్టి, ఇప్పుడు ఈ రేంజ్ కి చేరుకున్నారు విజయ్ సేతుపతి. ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ అబ్బురపరిచే నటనతో అభిమానుల మనసు గెలుచుకున్నాడు ఈ హీరో. నాయకుడు, ప్రతినాయకుడు, సహాయనటుడు... ఇలా ఏ పాత్రలో అయినా నటించి, మెప్పించగల నటుడు విజయ్‌ సేతుపతి. అయితే ఈ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి.. ఓ బాలీవుడ్ హీరో కి మించి పారితోషికం తీసుకున్నాడు అన్న ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇటు సౌత్ ఇండస్ట్రీలోనే కాదు అటు ఉత్తరాదిన కూడా ఈ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఇదేమి అంత ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు.. మా అన్న ఎందులోనైనా ఫస్ట్ అంటున్నారట ఈయన ఫాన్స్. ఇంతకీ ఎవరా బాలీవుడ్ హీరో..??ఎందులో వీరిద్దరూ కలిసి నటించారు అంటే..?? ఫ్యామిలీ మ్యాన్ క్రియేటర్స్ రాజ్ అండ్ డికె రూపొందిస్తున్న కొత్త వెబ్ సిరీస్ లో నటిస్తున్న విజయ్ సేతుపతికి ఆ సిరీస్ లో నటిస్తున్న కోస్టార్... బాలీవుడ్ ప్రముఖ హీరో షాహిద్ కపూర్ కంటే ఎక్కువ పారితోషికం చెల్లించారట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ `సన్నీ` పేరుతో ఇది రూపొందుతోంది. మొత్తం సీజన్ కు గాను షాహిద్ రూ .40 కోట్లకు డీల్ కుదుర్చుకోగా.. ఇదే ప్రాజెక్ట్ కోసం సేతుపతి సుమారు 55 కోట్లు డిమాండ్ చేశారని సమాచారం.

ఇది షాహిద్ తో పోలిస్తే చాలా పెద్ద మొత్తంలో పారితోషికం అందుకోవడం సెన్సేషనల్ న్యూస్ గా మారింది. మరోవైపు సౌత్ సినీ ఇండస్ట్రీలో ఈయనకు పెద్దపీట వేస్తున్నారు. టాలీవుడ్ మరియు కోలీవుడ్ లోనూ... కొందరు దర్శక నిర్మాతలు సేతుపతితో వారి సినిమా ట్రైలర్ లాంచ్ లు.. ఈవెంట్ గెస్ట్ అంటూ పలు కార్యక్రమాలకు సేతుపతిని సెలబ్రిటీ గెస్ట్ గా పిలిచి.. ఆయన చేతుల మీదగా జరిపిస్తూ ఆయన కీర్తి ప్రతిష్టలు మరింత పెంచేస్తున్నారు. ఒక చిన్న నటుడిగా ప్రారంభమై ఇంత పెద్ద స్థాయికి చేరుకోవడం అంటే నిజంగా విజయ్ సేతుపతి కేక అంటున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: