
పుష్ప రిలీజ్ డేట్ పై సుకుమార్ అసంతృప్తి ?
గత సంవత్సరం కరోనా పరిస్థితులు వల్ల వాయిదా పడ్డ ‘పుష్ప’ మూవీ ఎట్టకేలకు షూటింగ్ ప్రారంభం అయి ప్రస్తుతం ఆమూవీ షూటింగ్ పరుగులు తీస్తోంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర ఉన్న అటవీ ప్రాంతంలో చాల లోతైన గుట్టల వెనుక ఉన్న డీప్ ఫారెస్ట్ ప్రాంతంలో ఈమూవీ షూటింగ్ జరుగుతోంది.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి సంబంధించి ఇంకా 140 రోజుల వర్కింగ్ డేట్స్ ఉన్నాయి అంటున్నారు. అయితే ఈమూవీ ఆగష్టు 13న విడుదల అంటూ ఈమూవీ మేకర్స్ ఇచ్చిన ప్రకటన సుకుమార్ కు షాక్ ఇచ్చినట్లు సమాచారం. వాస్తవానికి ఈమూవీ రిలీజ్ డేట్ ప్రకటన విషయం సుకుమార్ కు చెప్పకుండా జరిగింది అన్న మాటాలు వినిపిస్తున్నాయి. ఈమూవీ రిలీజ్ కు ఇంకా 6 నెలల సమయం ఉంది అన్న ధైర్యంతో ఈ ప్రకటన ఇచ్చాము అని నిర్మాతలు చెపుతున్నప్పటికీ ఆ డేట్ కు ఆమూవీ రిలీజ్ అవుతుంది అన్న నమ్మకం సుకుమార్ కు లేదు అని టాక్.
వాస్తవానికి ఈమూవీని వేగంగా పూర్తి చేసి ఆగష్టు ప్రాంతం నుండి కొరటాల శివ దర్శకత్వంలో నిర్మాణం కాబోతున్న మూవీ కోసం రెడీ అవ్వాలని అల్లు అర్జున్ ప్లాన్ అని అంటున్నారు. అయితే సుకుమార్ మటుకు ఖంగారుతో ఈ మూవీని పరుగులు తీయిస్తే ఈమూవీ క్వాలిటీ దెబ్బతింటుంది అన్న అభిప్రాయంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి టాప్ హీరోల సినిమాల డేట్స్ అన్నీ ప్రకటింపబడుతున్నా ఆ మూవీలు అన్నీ ప్రస్తుతం ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న పరిస్థితులలో ఈ మూవీల రిలీజ్ డేట్స్ విషయంలో చాల మార్పులు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు..