పవన్ కళ్యాణ్ ఆ సినిమా కోసం రెండు రోజులు ఏమీ తినకుండా నటించారు.!! ఆ సినిమా ఏంటో తెలుసా?
నిజానికి ఈ సినిమా తమిళంలో "లవ్ టుడే" సినిమాకు రీమేక్ గా తెరకెక్కించినది. తమిళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ఈ సినిమాను తెలుగులో పవన్ కన్నా ముందుగా జె.డి.చక్రవర్తి ,అబ్బాస్ వంటి హీరోలతో తెరకెక్కించడానికి భావించారు.అప్పుడు గోకులంలో సీత సినిమాలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ గురించి ఆర్.బి.చౌదరి తెలుసుకొని తను నటించిన" అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" సినిమా చూసి ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ కరెక్ట్ అని భావించారు.
తమిళంలో హీరోయిన్ గా నటించిన రాశిని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని చిత్రబృందం భావించారు. అయితే అప్పటికే పలు సినిమాలలో బిజీ గా ఉన్న రాశికి కుదరక పోవడం వల్ల దేవయాని హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమాలో రఘు వర్ధన్ చనిపోయేటప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన ఉండరు.తరువాత తన తండ్రి చనిపోయారు అని తెలుసుకొని పవన్ తన సమాధి దగ్గర ఏడ్చి సన్నివేశం కోసం పవన్ కళ్యాణ్ దాదాపు రెండు రోజుల పాటు ఏమీ తినకుండా నీరసం రావడంతో ఆ సమయంలో ఏడ్చి ఈ సీన్ లో అద్భుతంగా నటించారు. సినిమాలో ఈ సీన్ కోసం పవన్ కళ్యాణ్ ఎంతో ప్రాక్టీస్ చేశారని ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేశారు. ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అప్పట్లోనే ఈ సినిమా నలభై తొమ్మిది సెంటర్లలో 50 రోజులు, తొమ్మిది సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా అప్పట్లోనే ఆరు కోట్ల షేర్ ను క్రాస్ చేసిందంటే గొప్ప విషయం అని చెప్పవచ్చు.