ఏంటీ.. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె కి.. రవితేజ అంటే ఇష్టం లేదా.. అసలు విషయం ఏంటంటే..?

praveen
ఈటీవీలో ప్రస్తుతం పలు రకాల షోలు బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రతి వారం కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. బుల్లితెర ప్రేక్షకులకు ఫేవరెట్ షో గా మారింది క్యాష్ షో. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ  ప్రతి వారం కూడా సరికొత్త గెస్ట్ లతో  ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సాధారణంగానే ఏదైనా షోకి  సుమ యాంకరింగ్ చేసింది అంటే ఇక ఆ షోకి క్రేజ్  అంతకంతకూ పెరిగి పోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఇక క్యాష్ షో కూడా ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.



 ఇక క్యాష్ షో లో భాగంగా ప్రతివారం కూడా నలుగురు సెలబ్రిటీలు గెస్ట్ లుగా  ఎంట్రీ ఇస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే ఇక క్యాష్ షోకి అతిథులుగా వచ్చిన వారితో ఆకర్షణీయమైన టాస్క్లు చేయిస్తూ ఉంటుంది సుమా.  అంతేకాదు ఫన్నీ ప్రశ్నలు అడుగుతూ అందరికీ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది. ఇక తనదైన స్పాంటేనియస్ పంచులతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది సుమా. కాగా ఇటీవలే ప్రోగ్రాం లో భాగంగా..  టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి సింగర్స్  గా కొనసాగుతున్న.. రఘు కుంచే, కల్పన,  మంగ్లీ, ధనుంజయ్ గెస్ట్ లుగా  ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల వచ్చే వారం కి సంబంధించి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



 ఇకపోతే క్యాష్ షో లో గెస్ట్ ఎవరు వచ్చినా సరే..  వారితో ఒక ఆట ఆడేసుకుంటున్నారు యాంకర్ సుమ. ఇక ఈ వారం వచ్చిన గెస్ట్ ల తో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసింది.  అయితే సాధారణంగా సుమ బాస్కెట్ బాల్ లీక్ అని ఒక టాస్క్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. టాస్క్ లో భాగంగా ఒక విచిత్రమైన ప్రశ్న అడుగుతూ ఉంటుంది సుమా. రఘు కొంచెం ను మీకు దర్శకుడు పూరి జగన్నాథ్ అంటే ఎక్కువ ఇష్టమా  లేదా..  రవితేజ అంటే ఎక్కువ ఇష్టమా అంటూ అడిగితే తనకుపూరి జగన్నాథ్ అంటే ఎక్కువ ఇష్టం అంటూ చెబుతాడు రఘు కుంచె. దీంతో బ్రేకింగ్ న్యూస్ అంటూ చెబుతూ.. రఘు కుంచే కి రవితేజ అంటే అస్సలు ఇష్టం లేదంట అంటూ చెబుతుంది సుమ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: