పుష్ప సినిమాలో అసలు సీక్రెట్ అదేనా.. గూస్ బంప్స్ పక్కా..!

shami
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. బన్నీ కెరియర్ లో పాన్ ఇండియా మూవీగా వస్తున్న పుష్ప సినిమా ఆగష్టు 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో అసలు సీక్రెట్ ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. సినిమాలో అల్లు అర్జున్ ఒక్కడు కాదు ఇద్దరట. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియదు కాని బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ తో సూపర్ హ్యాపీగా ఉన్నారు.

సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. పుష్ప సినిమాలో తమిళ స్టార్ హీరో శింబు, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ లో ఒకరు నటిస్తారని తెలుస్తుంది. పుష్ప కోసం సుకుమార్ చాలా సర్ ప్రైజులు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. తప్పకుండా బన్నీ కెరియర్ లో ఈ సినిమా మరో మైల్ స్టోన్ మూవీ అవుతుందని అంటున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్య, ఆర్య 2 తర్వాత వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ పుష్ప ఇద్దరి కెరియర్ లో చాలా ప్రత్యేకమైన సినిమాగా ఉంటుందని అంటున్నారు.

పుష్పలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో మాస్ ఆడియెన్స్ కు సూపర్ గా నచ్చేస్తారని తెలుస్తుంది. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ వదిలిన పోస్టర్ లో అల్లు అర్జున్ లుక్ మాస్ ఆడియెన్స్ ను పండుగ చేసుకునేలా ఉంది. ఇక అల్లు అర్జున్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అల్లు అర్జున్, సుకుమార్ మరో సెన్సేషనల్ మూవీ ప్రేక్షకులను అందించాలని చూస్తున్నారు. పుష్ప ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది ప్రేక్షకుల ముందుకు వస్తేనే అది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: