బాబోయ్.. 5010 రూపాయల నోటు.. మీరెప్పుడైనా చూసారా..?

praveen
ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్త్ ప్రస్తుతం బుల్లితెర చరిత్రలోనే టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న కామెడీ షో గా  దూసుకుపోతుంది. ఇక ఎన్నో ఏళ్ళ  నుంచి కూడా ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది జబర్దస్త్. ప్రస్తుతం బుల్లితెర పై సరికొత్త కామెడీ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇక జబర్దస్త్ కామెడీ షో కి తెలుగు ప్రేక్షకులు ఎంత ఎడిక్ట్  అయిపోయారు అంటే ప్రస్తుతం కాస్త నవ్వుకొని ఉపశమనం పొందాలి అన్నా  కూడా జబర్దస్త్ కార్యక్రమం చూస్తున్నారు ఎంతోమంది.



 ఇలా రోజురోజుకు జబర్దస్త్ క్రేజ్  పెరిగిపోతూనే ఉంది. అయితే జబర్దస్త్ కమెడియన్స్ ఎప్పటికప్పుడు సరికొత్త స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు.  అయితే ఇక బుల్లితెర ప్రేక్షకులందరికీ నవ్వించడానికి జబర్దస్త్ కమెడియన్స్ సరికొత్త కాన్సెప్ట్ తో తెరమీదికి వస్తూ ఉంటారు.  ఇక  జబర్దస్త్ లో ఎన్నో ఏళ్ల నుంచి కమెడియన్ గా  టీం లీడర్ గా కొనసాగుతున్న అదిరే అభి సరికొత్త కామెడీని పంచుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే .  ఇక ఇటీవలే విడుదలైన ప్రోమో చూస్తే మరోసారి అదిరే అభి సరికొత్త ఎంటర్టైన్మెంట్ పంచేందుకు సిద్ధమయ్యాడు అన్నది అర్ధమవుతుంది.



 ఈ క్రమంలోనే ఒక పంచ్ తో  అందరిని నవ్వించేశాడు అదిరే అభి. మన పెళ్లిలో  ఐదు వేల పది రూపాయలు మీ బంధువు ఒకరు చదివించాడు.. ప్రస్తుతం వాడి కోసమే వెతుకుతున్నారని అంటూ చెబుతాడు అదిరే అభి. ఐదు రూపాయలు అంటే బాగానే చదివించారు కదండీ అంటూ చెబుతుంది అదిరే అభి భార్య. బాగా చదివించడం కాదు వాడి అతితెలివితో 50 రూపాయలు పది రూపాయల నోట్లు అతికించి ఐదు వేల పది రూపాయలు అంటూ చదివించాడు అంటూ అదిరే అభి ఒక సరికొత్త నోట్ చూపించడంతో అందరూ అది చూసి కడుపుబ్బ నవ్వుకున్నారు.  దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: