సమంత అనుష్క లకు మొదలైన ఎదురీత !

Seetha Sailaja

దక్షిణాది సినిమా రంగంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు చిరునామాగా సమంత అనుష్క లు ఎదిగారు. అనుష్క అయితే ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీ స్థాయికి ఎదిగినా ఆమెకు రోజురోజుకు అవకాశాలు తగ్గిపోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

ఇక అక్కినేని కుటుంబ కోడలుగా మారిన తరువాత సమంతకు కూడ బాగా అవకాశాలు తగ్గిపోయాయి. కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే కాకుండా ఇప్పటికీ తాను గ్లామర్ హీరోయిన్ గా నటించడానికి సిద్ధం అని సమంత సంకేతాలు ఇస్తూ అనేక ఫోటో షూట్స్ ఇస్తున్నా ఆమెను టాప్ హీరోలు మాత్రమే కాదు మిడిల్ రేంజ్ హీరోలు కూడ పట్టించుకోకపోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది.

తెలుస్తున్న సమాచారంమేరకు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ మూవీలో దుష్యంతుడి పాత్రలో నటించడానికి రానా తో సహా ఏ ఒక్క మిడిల్ రేంజ్ హీరో సమంత పక్కన నటించడానికి ఒప్పుకొని పరిస్థితులలో ఒక మళయాళ నటుడుని ఈ దుష్యంతుడి పాత్రకు ఎంపిక చేయవలసి వచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇక అనుష్క పక్కన నటించడానికి టాప్ హీరోలు మాత్రమే కాకుండా మిడిల్ రేంజ్ హీరోలు కూడ ఆసక్తి కనపరచడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి.

ఆమెతో నటించేకన్నా శ్రుతిహాసన్ కాజల్ లతో నటిస్తాము కానీ తమకు అనుష్క సమంత వద్దు అంటూ ఉండటంతో వారిని ఎంపిక చేద్దామని దర్శక నిర్మాతలు భావిస్తున్నా వారి ప్రయత్నాలు ముందుకు సాగడం లేదని టాక్. దీనికితోడు వీరిద్దరూ నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు సక్సస్ రేట్ అంతంత మాత్రంగా ఉండటంతో వీరితో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తీయడానికి దర్శక నిర్మాతలు ముందుకు రావడం లేదని అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో వీరిని దృష్టిలో పెట్టుకుని కథలు వ్రాసే రచయితలు కూడ కరువయ్యారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కంటే వయసులో పెద్ద అయిన నయనతార మ్యానియా ఇంకా కొనసాగుతూ ఉంటే మంచి హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్నా వీరిద్దరికీ ఈ ఎదురీత ఎందుకు వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: