
ఇమ్మాన్యూయేల్, వర్ష మధ్య రిలేషన్‌షిప్ గురించి అదిరే అభి ఏం చెప్పాడో తెలుసా?
ప్రేక్షకులు కూడా ఇటువంటి వారి స్కిట్‌లను, పెర్ఫార్మెన్స్‌లను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఇమ్మాన్యూయేల్, వర్ష మధ్య రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా కెమిస్ట్రీ నడుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇమ్మాన్యూయేల్ అంటే తనకు ఎంతో ఇష్టమంటూ వర్ష ఇప్పటికే అనేక సార్లు చెప్పింది. పైగా ఇమ్మాన్యూయేల్‌ను ముద్దుగా ఇమ్మూ అని పిలుస్తుంటుంది. అయితే వీరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌పై తాజాగా అదిరే అభి స్పందించాడు. తనకు తెలిసినంత వరకు ఇమ్మూ, వర్ష మధ్య ఉన్నది స్నేహమే అని, అంతకు మించి మరేమీ ఉండకపోవచ్చునని చెప్పుకొచ్చాడు.
తనకు సుధీర్, రష్మీ మంచి స్నేహితులనే విషయం బాగా తెలుసని, అయితే వర్ష, ఇమ్మాన్యూయేల్‌తో తాను పెద్దగా టచ్‌లో ఉండనని, స్కిట్ అయిన వెంటనే ఎవరికి వాళ్లు వెళ్లిపోతామని అన్నాడు. అదిరే అభి కచ్చితంగా వారి మధ్య ఉన్నది స్నేహమే అని చెప్పకపోవడంతో.. వీరి మధ్య ఇంకేదో నడుస్తోందనే హింట్ ఇచ్చినట్టు అయింది. పైగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ రోజు రోజుకూ పెరిగిపోతూ వెళ్తోంది. సుధీర్, రష్మీ జంటకు పోటీగా వచ్చేశారని చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు.