పెరిగిపోతున్న సమ్మర్ క్యూ కన్ఫ్యూజన్ లో బయ్యర్లు !
ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈమూవీలో చిరంజీవి సోదరిగా నయనతార నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్న మోహన్ రాజా ఈమూవీ కథలో తెలుగు నేటివిటీ కి అనుగుణంగా చాల మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఈమూవీ షూటింగ్ ను చాల వేగంగా పూర్తి చేయాలి అని చిరంజీవి భావిస్తున్న పరిస్థితులలో ఇప్పటివరకు చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించబోయే తమిళ మూవీ ‘వేదాళం’ రీమేక్ గురించి కూడ ఒక అధికారిక ప్రకటన వస్తుందని భావించారు. అయితే ఇప్పుడు ఈమూవీ విషయంలో చిరంజీవి మళ్ళీ ఆలోచనలో పడటంతో ఈమూవీని హోల్డ్ లో పెట్టినట్లు గుసగుసలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే చిరంజీవి తాను ఒప్పుకునే భవిష్యత్ సినిమాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలుస్తున్న సమాచారం మేరకు చిరంజీవి అంగీకరించే కొత్త సినిమాల కథలు రొటీన్ కమర్షియల్ సినిమాలుగా ఉంటూ ఫైట్స్ కు డాన్స్ లకు ప్రాధాన్యత ఇచ్చే కథలకన్నా ప్రేక్షకులకు ఒక సామాజిక సందేశం ఇచ్చే కథల వైపు మెగా స్టార్ ఆలోచనలు మారుతూ ఉండటంతో ‘వేదాళం’ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది అని అంటున్నారు. అయితే ఈమూవీ ప్రాజెక్ట్ ను నమ్ముకుని ఎన్నో ఆశలు పెట్టుకున్న మెహర్ రమేష్ పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. చిరంజీవి తాను ఒప్పుకునే సినిమాల విషయంలో ఎటువంటి మొహమాటాలకు తావివ్వడు అన్నది ఓపెన్ సీక్రెట్. ‘లూసీఫర్’ రీమేక్ విషయంలో ముందుగా అనుకున్న సుజిత్ ఆతరువాత రంగంలోకి వచ్చిన వినాయక్ ఇలా వీరిద్దరినీ తప్పించి చివరకు చిరంజీవి మోహన్ రాజా ను ఎంపిక చేసుకున్నాడు అంటే చిరంజీవి తన దర్శకుల ఎంపిక విషయంలో ఎంత ఖచ్చితంగా ఉంటున్నాడో అర్థం అవుతుంది..