నా తల్లి వల్ల చిన్నప్పుడే వర్జినిటీ పోయింది.. షకీలా షాకింగ్ కామెంట్స్..?
అప్పట్లో షకీలా కి ఎంతలా క్రేజ్ ఉండేది అంటే హీరోల కోసం కాదు కేవలం షకీలా కోసం మాత్రమే సినిమా కు వెళ్లే ప్రేక్షకులు ఉండేవారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఎన్నో ఏళ్ల పాటుదక్షిణాది చిత్ర పరిశ్రమలో శృంగార భరితమైన పాత్రలలో అలరించిన షకీలా... వందల సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఈ మధ్య కాలంలో అవకాశాలు కరువవడంతో షకీలా పూర్తిగా కనుమరుగు అయ్యింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చిన షకీలా తన పర్సనల్ లైఫ్ లోని పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.
ఈ క్రమంలోనే తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను ఆలీతో సరదాగా అనే షో వేదికగా బయటపెట్టింది షకీలా. అదే సమయంలో అటు ఎవరికీ తెలియని విషయాలను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగి తెలియజేశారు వ్యాఖ్యాత అలీ. అయితే మీరు యంగ్ ఏజ్ సమయంలో ఉన్నప్పుడే మీ వర్జినిటీ పోవడానికి కారణం మీ అమ్మగారే అనే విషయాన్ని ఆటోబయోగ్రఫీ లో రాశారు.. అంత ఓపెన్ గా ఎందుకు చెప్పారు అని ఆలీ ప్రశ్నించడంతో... నిజంగానే అలా జరిగిందని.. అలా చెప్తే ఇక వేరే వాళ్ళు కూడా అలా చేయకుండా జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతోనే తన ఆటోబయోగ్రఫీ లో ఆ విషయాన్ని చెప్పాను అంటూ చెప్పుకొచ్చింది షకీలా.