ఈసారి అంతకు మించి ఉంటుందట ... ఆడియన్స్ కాస్కోండి ....??
ఎట్టకేలకు ఇటీవల ప్రారంభం అయిన ఈ సినిమా తొలి షెడ్యూల్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి కొద్దిసేపటి క్రితం తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక ఫోటో పోస్ట్ చేసారు. షూటింగ్ ఎంతో సందడిగా సాగుతోందని, మొదటి భాగాన్ని మించేలా తప్పకుండా ఈ మూవీ రిలీజ్ తరువాత భారీ సక్సెస్ అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వరుణ్ తేజ్ కూడా అనిల్ రావిపూడి పోస్ట్ ని ట్యాగ్ చేస్తూ ఫస్ట్ షెడ్యూల్ ఎంతో ఎంజాయ్ చేసానని, తదుపరి షెడ్యూల్ కోసం వెయిటింగ్ అంటూ పోస్ట్ చేయడం జరిగింది.
కాగా వెంకటేష్ రెండవ షెడ్యూల్ లో జాయిన్ అవుతారని, ఇక అక్కడి నుండి నిరంతరాయంగా ఏ మాత్రం బ్రేక్స్ లేకుండా షెడ్యూల్స్ కొనసాగుతాయని, వీలైనంత త్వరగా మూవీ షూటింగ్ పూర్తి చేసి దీనిని థియేటర్స్ లోకి తీసుకువచ్చేలా యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇక ఈ మూవీ కోసం దేవిశ్రీ అద్భుతమైన ఐదు సాంగ్స్ ని ఇప్పటికే సిద్ధం చేసారని, వెంకీ, వరుణ్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఎఫ్ 3 మూవీ తో పాటు ఇందులోని సాంగ్స్ కూడా ఆకట్టుకుంటాయని సమాచారం. మరి ఈ సినిమా మొదటి భాగాన్ని మించేలా ఎంతవరకు సక్సెస్ సాధిస్తుందో తెలియాలి అంటే మరికొన్నాళ్ల వరకు వెయిట్ చేయాలి.....!!