బాలీవుడ్ సినిమాకి రెడీ అవుతున్న అఖిల్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...టాలీవుడ్ యంగ్  హీరో అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పటికి హిట్ అందుకోలేదు. అన్నయ్య నాగ చైతన్య, నాన్న నాగార్జునలు మంచి హిట్లు అందుకున్నారు కాని  అఖిల్ మాత్రం ఇంకా మొదటి హిట్  కోసం ఎదురుచూస్తూనే  ఉన్నాడు. హిట్టు పడితే గాని కెరీర్ కు ఒక బూస్ట్ రాదు. ఎలాగైనా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకోవాలని అనుకుంటున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే ఆ సినిమా తరువాత  సురేందర్ రెడ్డి సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే... ఇక అసలు విషయానికి వస్తే...అఖిల్ కోసం అతని వదిన సమంత ఒక పవర్ఫుల్ స్టోరీని రెడీ చేయించిందట. ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన రాజ్ – డీకేలు త్వరలోనే అఖిల్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ప్రస్తుతం మంచి ఫాంలో వున్న ఈ దర్శకులు  తెలుగులో మొదట్లో డి ఫర్ దోపిడీ అనే సినిమా చేశారు.

ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేకపోయింది.కానీ వారికి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ దక్కింది. వారిద్దరు తెలుగు వారే కావడంతో మళ్ళీ సొంత భాషలో ఒక బాక్సాఫీస్ హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. ఇక సమంత వారి నుంచి విన్న కథకు అఖిల్ కి వినిపించినట్లు  టాక్ వస్తోంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజుల ఆగాల్సిందే. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: