
వరుణ్ ధావన్ పెళ్లి వార్తకు బాధపడుతున్న లేడీ ఫ్యాన్స్...
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ నెల 24న ముంబైలోని అలీబాగ్‌లో ఈ స్టార్ సెలబ్రెటీల వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. వివాహం కేవలం 40 నుండి 50 అతిథుల సమక్షంలోనే జరగనుందట. అలీబాగ్ లోని బీచ్ కు ఎదురుగా ఉన్న మొత్తం రిసార్ట్‌ను పెళ్లి వేడుక కోసం బుక్ చేసుకున్నట్లు సమాచారం. వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తిగా రెడీ చేసినట్లు సమాచారం అందుతుంది.
తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లిని చాలా గ్రాండ్ గా చేయనున్నట్లు తెలుస్తోంది. జనవరి 22, 23, అలాగే 24 వరకు మొత్తం 3 రోజులు వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక బాలీవుడ్ సెలబ్రెటీల కోసం ముంబైలోని ఒక స్టార్ హోటల్ లో ప్రత్యేకమైన పార్టీని కూడా నిర్వహించనున్నారని సమాచారం అందుతుంది.కాని వరుణ్ పెళ్లి వార్త వినగానే అతని లేడీ ఫ్యాన్స్ ఎంతగానో బాధపడుతున్నారట. వరుణ్ కి వున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అతని పెళ్లి వార్త వినగానే లేడీ ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారట. గతంలో కూడా ముంబై కి చెందిన ఓ యువతీ వరుణ్ ని పెళ్లి చేసుకోమని బెదిరించిన సంగతి తెలిసింది. అది మనోడి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...