
సింగర్ సునీత రెండో వివాహం చేసుకోవడం పట్ల నాగబాబు ఏమన్నారో చూడండి
ఓ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన నాగ బాబు వీరిద్దరికి అభినందనలు తెలిపారు. ఈ ఫొటోలో ఆయన ఏం రాసుకొచ్చారంటే.. ఆనందం అనేది మన పుట్టుకతో వచ్చేది కాదు.. ఆనందం అనేది మనం వెతుక్కునేది, సాధించుకునేది. మీరిద్దరూ ఒకరిలో ఒకరు ఆనందాన్ని వెతుక్కున్నందుకు మీరిద్దరికి అభినందనలు. మీరిద్దరూ ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు. చాలా మంది ఇటువంటి నిర్ణయం తీసుకునేందుకు ఎంతో ఆందోళన చెందుతుంటారు. సమాజం ఏమనుకుంటుందోననే భయంతో ఉంటారు. అలాంటి వారందరికి మీరు ప్రేరణగా ఉన్నారు. ఆనందం, ప్రేమ అనేవి మీతో జీవితాంతం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరిద్దరికి హ్యాపి మ్యారీడ్ లైఫ్’ అంటూ నాగబాబు రాసుకొచ్చారు.
కాగా.. సింగర్ సునీత రెండో వివాహంపై నెట్టింట్లో విమర్శలు కూడా చేసేవారు లేకపోలేదు. పెళ్లి వయసున్న పిల్లలను పెట్టుకుని ఈమె మళ్లీ పెళ్లి చేసుకోవడమేంటంటూ కొంత మంది సునీతపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ఎవరి జీవితం వారి ఇష్టమని, వారి జీవితంలోకి వెళ్లి విమర్శలు చేసే హక్కు ఎవరికి లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనప్పటికి ఈ వయసులో కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉండేందుకు వివాహం చేసుకున్న వీరిద్దరూ కలకలం ఆనందంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం.