అల్లుడు అదుర్స్ మూవీ టీం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రెడ్ మూవీ టీం.....
ఇలా విడుదల తేదీలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ సినిమా ఒకరోజు ముందుకు జరిగి 14న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా సినిమాను ముందుకు జరపాలనే నిర్ణయం ‘రెడ్’ టీమ్ కి ఏమాత్రం నచ్చడం లేదట. ముందే డేట్లు లాక్ చేసుకొని, థియేటర్లు లాక్ చేసుకుంటే.. ఇప్పుడు సడెన్ గా ఆఖరి నిమిషాల్లో నిర్ణయం మార్చడం ఏంటంటూ ‘రెడ్’ టీమ్ వాదిస్తోంది. ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయాల మేరకు.. ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు విడుదల అవ్వడానికి వీలు లేదు.
మరీ ముఖ్యంగా పండగ సీజన్లలో ఇలా విడుదల తేదీలు గొడవలు అవ్వకుండా ప్రొడ్యూసర్ గిల్డ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. నిర్మాతలతో ముందుగానే చర్చలు జరిపి క్లాష్ అవ్వకుండా చూసుకుంటుంది. అలాంటిది ఇప్పుడు సడెన్ గా ‘అల్లుడు అదుర్స్’ డేట్ మారడం గిల్డ్ లో సైతం చర్చనీయాంశమైంది. గిల్డ్ సభ్యులు ఇప్పుడు ఇరు చిత్ర నిర్మాతలను పిలిచి మాట్లాడే పనిలో ఉన్నారు. ఈ వ్యవహారాన్ని సైలెంట్ గా సాల్వ్ అయ్యేలా చూస్తున్నారు. మరి ‘అల్లుడు అదుర్స్’ దర్శకనిర్మాతలు ఈ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...