పవన్ ప్రభాస్ ల మధ్య డిజిటల్ వార్ పెరిగిపోతున్న ఆశక్తి !
గతంలో ఒక ఫ్లెక్సీ విషయంలో భీమవరం దగ్గర పవన్ ప్రభాస్ అభిమానుల మధ్య వార్ జరిగినప్పుడు జరిగిన రగడ హాట్ టాపిక్ గా మారింది. చివరకు పవన్ ప్రభాస్ లు స్వయంగా స్పందిస్తే కాని ఆ రగడ చల్లారలేదు.
ఇప్పుడు రాబోతున్న సంక్రాంతికి సోషల్ మీడియా వేదికగా పవన్ ప్రభాస్ అభిమానుల మధ్య మరో వార్ జరగబోతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. సంక్రాంతి పండగ రోజున ‘వకీల్ సాబ్’ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. పవన్ అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్న ఆ ట్రైలర్ విషయంలో రికార్డులు క్రియేట్ చేయాలని పవన్ అభిమానులు పక్కా ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం.
కొన్ని గంటల తేడాతో అదే సంక్రాంతి రోజున ప్రభాస్ ‘రాథే శ్యామ్’ టీజర్ కూడ విడుదల కాబోతోంది. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ టీజర్ హిట్స్ విషయంలో సంచలనాలు సృష్టిస్తుందని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. పవన్ ప్రభాస్ లకు ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో వీరాభిమానులు ఉన్నారు. దీనితో ఈ రెండు టీజర్ల హడావిడితో సోషల్ మీడియా సంక్రాంతి పండుగ మూడు రోజులు హోరేత్తిపోవడం ఖాయం.
అయితే ‘రాథే శ్యామ్’ టీజర్ ను ఆ మూవీ విడుదల అయ్యే హిందీ కన్నడ మళయాళం తమిళ తెలుగు భాషలలో కూడ డబ్ చేసి విడుదల చేస్తారు కాబట్టి టీజర్ వ్యూస్ విషయంలో ‘రాథే శ్యామ్’ ‘వకీల్ సాబ్’ పై తన ఆధిపత్యాన్ని చాటుకో గలుగుతాడు అన్న అంచనాలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన పవన్ అభిమానులు ఎదోవిధంగా ప్లాన్ చేసి ‘రాథే శ్యామ్’ టీజర్ కు గట్టిపోటీ ఇవ్వాలని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ‘రాథే శ్యామ్’ మూవీ బడ్జెట్ 250 కోట్లు దాటి పోవడంతో ప్రభాస్ తీవ్ర ఒత్తిడికి లోనవ్వడమే కాకుండా ఈ మూవీకి ఆ రేంజ్ లో కలక్షన్స్ వస్తాయా అన్నభయంలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..