మారుతి.. గోపీచంద్.. ఆ సినిమా రీమేక్..!

shami
ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మారుతి తన నెక్స్ట్ సినిమాను గోపీచంద్ హీరోగా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ కలిసి చేస్తున్న ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ జాలీ ఎల్.ఎల్.బి 2కి రీమేక్ గా వస్తుందని తెలుస్తుంది. తండ్రి, కూతుర్ళ్ల మధ్య జరిగే సెంటిమెంట్, ఎమోషల స్టోరీతో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. సినిమాలో గోపీచంద్ లాయర్ పాత్రలో నటిస్తాడని తెలుస్తుంది.

రీమేక్ కథే అయినా దానికి మారుతి మార్క్ ఎంటర్టైనింగ్ ను యాడ్ చేసి సినిమా చేస్తారని తెలుస్తుంది. గోపీచంద్ ఈమధ్య కెరియర్ లో చాలా వెనకపడ్డాడు. అతని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. మారుతి సినిమాతో తన కెరియర్ ను ఫాం లోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు గోపీచంద్. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది డైరక్షన్ లో వస్తున్న సీటీమార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది.

ఇదేకాకుండా గోపీచంద్ తేజా కాంబినేషన్ లో అలిమేలు వెంకటరమణ సినిమా వస్తుంది. సంపత్ నంది, మారుతి, తేజా ముగ్గురు దర్శకులతో గోపీచంద్ మళ్లీ తన కెరియర్ ను సెట్ రైట్ చేసుకోవాలని చూస్తున్నాడు. తప్పకుండా గోపీచంద్ మళ్లీ తన మునుపటి ఫాం లోకి వస్తే అతని ఫ్యాన్స్ పండుగ చేసుకునే అవకాశం ఉంది. పర్ఫెక్ట్ మాస్ హీరో కటౌట్ ఉన్నా కథల విషయంలో గోపీచంద్ చేస్తున్న మిస్టేక్స్ వల్ల అతని కెరియర్ రిస్క్ లో పడ్డది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: