సుశాంత్ ప్రియురాలు అప్పుడే కొత్త బాయ్ ఫ్రెండ్ ని చూసుకుందా.. మరి ఈ ఫోటో ఏంటి..?
ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు సంబంధించిన కేసు విచారణ జరుగుతున్నన్ని రోజులు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మీడియాలో రియా చక్రవర్తి పేరు కాస్త కనుమరుగయ్యింది. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది రియా చక్రవర్తి. దీనికి కారణం రియా చక్రవర్తి మరో వ్యక్తితో ఎంతో సన్నిహితంగా ఉండడమే. ఎమ్ టీవీ రోడీస్ ఫేమ్ రాజీవ్ లక్ష్మణ్ తో రియా చక్రవర్తి ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
అయితే రియా చక్రవర్తి తో ఎంతో సన్నిహితంగా దిగిన ఫోటో ని షేర్ చేసిన రాజీవ్ ఐ లవ్ యు అంటూ ఫోటో కి కామెంట్ చేశాడు. దీంతో నెటిజనులు ఈ ఫోటో పై దారుణంగా కామెంట్ చేశారు. సుశాంత్ చనిపోయిన కొన్ని రోజుల్లోనే రియా చక్రవర్తి మరొక బాయ్ ఫ్రెండ్ ని చూసుకుంది అంటూ దారుణంగా కామెంట్ చేశారు నెటిజన్లు. దీంతో వెంటనే అప్రమత్తమైన రాజీవ్ పోస్టు ని తొలగించి రియా చక్రవర్తి తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తన వ్యాఖ్యల పట్ల అందరిని క్షమాపణ కోరాడు రాజీవ్. ఇలా మరోసారి రియా చక్రవర్తి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.