పవన్ మూవీ లో లేడీ విలన్ .... మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాకే .....??
ఇకపోతే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ని సంక్రాంతి పండుగ తర్వాత ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయనున్నారు మూవీ యూనిట్. మరోవైపు దీనితోపాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ గా నటిస్తున్నట్లు టాక్. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా లాక్ డౌన్ కి ముందు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా దీని తదుపరి షెడ్యూల్ ని అతి త్వరలో ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్. పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో అలానే భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
పవన్ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా అలానే సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆకట్టుకునేలా దర్శకుడు క్రిష్ ఈ మూవీ స్క్రిప్ట్ ను ఎంతో అద్భుతంగా సిద్ధం చేశారని ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్రలో టాలీవుడ్ కి చెందిన సీనియర్ నటి నటించనున్నారని సమాచారం. కాగా అది సినిమాలో నెగటివ్ పాత్ర అని అయితే అటువంటి పాత్రకు గాను ఇటీవల పలువురు నటీమణుల పేర్లను పరిశీలించిన దర్శకుడు క్రిష్ ఎట్టకేలకు ఒకరిని ఎంపిక చేశారని అతి త్వరలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి అని అంటున్నారు . తన మీద అలానే స్క్రిప్ట్ మీద నమ్మకంతో పవన్ కళ్యాణ్ తనకు ఈ సినిమా అవకాశం ఇచ్చారని దాని నిలబెట్టుకునేలా అలానే మూవీ బ్లాక్ బస్టర్ కొట్టేలా దీనిని ఎంతో గొప్పగా తెరకెక్కిస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా క్రిష్ మాట్లాడుతూ చెప్పారు.....!!