మహేష్ బాబు కు ఫ్యాన్ గా మారిన ...అక్కినేని అందగాడు ...!?
.ఈ సినిమాలో చైతన్య అభిరాం అనే పాత్రలో నటించనున్నారు.అభిరామ్ ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబుకు పెద్ద అభిమానిగా ఉండటం వల్ల ఈ సినిమాలో మహేష్ బాబు అభిమానుల సంఘం అధ్యక్షుడిగా కనిపించనున్నాడు.నాగచైతన్య పేరు అభిరామ్ పేరిట, మహేష్ బాబు పోస్టర్లతో ఉన్న బ్యానర్లను థియేటర్ ప్రాంగణంలో కట్టారు.దీంతో ఈ సినిమాలో నాగచైతన్య మహేశ్ బాబు అభిమానిగా కనిపించబోతున్నాడనే న్యూస్ లీకైంది. మరోవైపు ఈ సినిమాలో కొన్ని నిమిషాలపాటు మహేశ్ బాబు తళుక్కున మెరవబోతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక అక్కినేని ఫ్యామిలీతో మహేశ్ బాబుకు మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి.
బీవీఎస్ రవి సమకూర్చిన కథను దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా.. అవికా గోర్ మరో కథానాయికగా కనిపించనుంది. చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ విషయం అటు అక్కినేని అభిమానులు, ఇటు మహేష్ బాబు అభిమానులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పొచ్చు