నెటిజన్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మాధవన్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సోషల్ మీడియా వచ్చిన తరువాత సెలబ్రిటీలను టార్గెట్ చేసి ట్రోల్ చేయడం బాగా ఎక్కువైంది. కొంతమంది నెటిజన్లు యాక్టర్లను ఉద్దేశిస్తూ వారిపై  నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. కానీ వీటిని తారలు పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక్కోసారి మితిమీరిన కామెంట్స్ చూస్తే మాత్రం వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు. తాజాగా హీరో మాధవన్ కూడా ఇలానే ఓ నెటిజన్ మీద కోప్పడ్డాడు. మాధవన్ ని ఉద్దేశిస్తూ ఓ లేడీ డాక్టర్ సోషల్ మీడియాలో.. ”మ్యాడీకి పెద్ద అభిమానిని.కానీ అతడు తాగుడుకు బానిసై, డ్రగ్స్ కి అలవాటు పడుతూ అటు కెరీర్ ను, ఇటు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం చూడలేకపోతున్నా.. బాలీవుడ్ లో వచ్చిన కొత్తలో ఎలా ఉన్నాడు..? ఇప్పుడు ఎలా తయారయ్యాడు..? అతడి ముఖం చూస్తేనే తెలుస్తుంది” అంటూ పోస్ట్ చేయడం జరిగింది.

ఇది చూసిన మాధవన్ కి కోపం వచ్చింది. వెంటనే రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ”ఓహో.. మీరు ఇలా పరీక్షిస్తారన్నమాట. పాపం, మీ పేషేంట్లను చూస్తుంటే నాకు జాలేస్తుంది. నాకు తెలిసి మీరు డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం మంచిది” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

ఆ నెటిజన్ చేసిన పోస్ట్  పై మాధవన్ ఫ్యాన్స్ కూడా విరుచుకు పడుతున్నారు. ఒక వ్యక్తి గురించి నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటూ ఫైర్ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మాధవన్ నటించిన ‘మారా’ అనే సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది.

జనవరి 8న అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్‌’ అనే సినిమాలో మాధవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: