పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం వకీల్ సాబ్
సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై అటు
పవన్ ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. వేణు
శ్రీరామ్ దర్శకత్వంలో
దిల్ రాజు, బోనికపూర్ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో
పవన్ కి జోడిగా
శృతిహాసన్ నటిస్తుండగా
నివేద థామస్,
ప్రకాష్ రాజ్,
అంజలి, మురళీశర్మ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తొలిసారిగా
పవన్ సినిమాకి ఎస్ఎస్
థమన్ మ్యూజిక్ ఉండగా పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ
సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడం అలాగే తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతుండడంతో
మూవీ పై ప్రేక్షకుల్లో అభిమానుల్లో మరింతగాbఅంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక దీని తర్వాత
హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక
సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాతో పాటు
యువ దర్శకుడు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియం
సినిమా తెలుగు
రీమేక్ లో కూడా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్నారు. ఇప్పటికే ఈ మూడు సినిమాలకు సంబంధించి అధికారికంగా ప్రకటనలు కూడా రావడం జరిగింది.
మరోవైపు వీటితోపాటు ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో కూడా ఒక
సినిమా చేస్తున్న
పవన్ దానిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే తదుపరి
పవన్ నటించబోయే ఒక సినిమాలో
హీరోయిన్ గా
మహర్షి,
అలవైకుంఠపురములో,
గద్దలకొండ గణేష్ సినిమాలతో భారీ
సక్సెస్ లు అందుకున్న
పూజా హెగ్డే నటించనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే
పవన్ చేయబోయే తదుపరి సినిమాకు సంబంధించి
హీరోయిన్ గా పూజాహెగ్డే ఫిక్స్ అయిందని అతి త్వరలో దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని అంటున్నారు. అయితే
పవన్ తదుపరి చేయబోయే మూడు సినిమాల్లో ఏ సినిమాలో ఆమె
హీరోయిన్ గా ఎంపికైంది అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉందని మొత్తంగా డీటెయిల్స్ మనకు తెలియాలంటే మరికొన్నిరోజుల వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు విశ్లేషకులు....!!