స్టేజ్‌పై నిధి అగ‌ర్వాల్‌కి అవ‌మానం..!?

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నిధి అగ‌ర్వాల్. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ మ‌ధ్య‌న ఓ షాపింగ్ మాల్‌కి వెళ్లిన నిధి అగ‌ర్వాల్‌ని అక్క‌డి జ‌నాలు ఉక్కిరిబిక్కిరి చేసిన విష‌యం తెలిసిందే. అప్పుడు బౌన్స‌ర్ల సాయంతో ఎలాగోలా భ‌య‌ట‌ప‌డింది నిధి. అయితే ఈ బ్యూటీకి మ‌రోసారి అవ‌మానం ఎదురైంది. స్టేజ్‌పై మాట్లాడుతున్న ఈ న‌టిని ఓ ద‌ర్శ‌కుడు ఇబ్బంది పెట్టాడు. దీంతో చాలా అసౌక‌ర్యానికి గురైంది నిధి. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌గా.. ఆ ద‌ర్శ‌కుడిపై నెటిజ‌న్లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
ఇక శింబు హీరోగా న‌టించిన ఈశ్వ‌ర‌న్ మూవీ ద్వారా నిధి అగ‌ర్వాల్ కోలీవుడ్ ‌కి ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఆడియో విడుద‌ల‌ వేడుక ఇటీవ‌ల జ‌రిగింది. ఇక ఈ కార్య‌క్ర‌మంలో నిధి మాట్లాడుతుండ‌గా.. ద‌ర్శ‌కుడు సుసీంద్ర‌న్ ప‌లుమార్లు ఆమెకు అడ్డుప‌డ్డాడు. ప‌లుమార్లు సింబు మామ ఐ ల‌వ్యు అని చెప్పు అంటూ ఆమెను బ‌ల‌వంత పెట్టాడు. దీంతో ఆమె కాస్త ఇబ్బందికి గురైంది. ఇక ఈ వీడియోపై నెటిజ‌న్లు కూడా మండిప‌డుతున్నారు. ఇలాంటి బిహేవియ‌ర్ మంచిది కాద‌ని, అస‌లు స్టేజ్ ‌పై ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న ఏంట‌ని వారు కామెంట్లు పెడుతున్నారు.
ఈ క్ర‌మంలో దానిపై వివ‌ర‌ణ ఇచ్చాడు ఈ దర్శ‌కుడు. సినిమాలో శింబును ఉద్దేశించి నిధి మామా ఐ ల‌వ్యూ అని చెప్పే డైలాగ్ ఉంటుంద‌ని.. దాన్ని దృష్టిలో ఉంచుకొనే అలా చెప్ప‌మ‌ని చెప్పాన‌ని తెలిపాడు. కాగా గ‌తంలోనూ ఈ ద‌ర్శ‌కుడి పేరు ప‌లు వివాదాల్లో వినిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: