క్యాస్ట్ కారణం చెప్పి ఆమె నన్ను వదిలేసింది.. బిగ్బాస్ ఫేమ్ అఖిల్ షాకింగ్ కామెంట్స్..?

praveen
బిగ్బాస్ సీజన్ 4 రియాలిటీ షో ద్వారా అఖిల్  ఎంత గానో గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.  అంతకు ముందు వరకు కేవలం కొంతమందికి మాత్రమే తెలిసిన అఖిల్  బిగ్ బాస్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరికీ సుపరిచితుడుగా మారి పోయాడు. బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ పాప తో లవ్ స్టోరీ నడిపించి మరింత క్రేజ్ సంపాదించాడు . ఇక బిగ్బాస్ సీజన్ మొత్తం వీరి రొమాంటిక్ లవ్ స్టోరీ నడిచింది. ఇక చివరి వరకు కొన సాగిన అఖిల్ రన్నరప్ గా నిలిచాడు అన్న విషయం తెలిసిందే.


 ఇక హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా మోనాల్ అఖిల్ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవలే లవ్ బ్రేకప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు అఖిల్ సార్థక్. అయితే లవ్ బ్రేకప్ అయింది మోనాల్ తో  కాదు ఇది పాత లవ్ స్టోరీ. క్యాస్ట్ ఫీలింగ్ తో తన లవర్ తనను వదిలేసిందని.. ఈసారి మాత్రం క్యాస్ట్ ఫీలింగ్ లేని అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటూ అఖిల చెప్పుకొచ్చాడు. తను ఎప్పటికైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటానని.. చిన్న వయసులోనే తన హృదయం బద్దలయింది అంటూ చెప్పుకొచ్చాడు..



 ఇప్పటికీ కూడా క్యాస్ట్ ఫీలింగ్ చాలా మందిలో ఉంది.. నన్ను ప్రేమించిన అమ్మాయి క్యాస్ట్ ఫీలింగ్ తో చివరికి నన్ను వదిలేసింది.. నాకైతే అలాంటిది లేదు..  కలిసి బ్రతకడానికి ఒక్క రీజన్ చాలు. వదిలించుకోవాలి అంటే వెయ్యి కారణాలు ఉంటాయి.. ఇలా వెయ్యి కారణాలు చెప్పి నాకు బ్రేక్ అప్ చెప్పేసింది. ఫస్ట్ లవ్ బ్రేకప్ అయ్యింది..  ఇక నుంచి ఎవరినైనా లవ్ చేస్తే ముందుగానే క్యాస్ట్  చెప్పిన తర్వాతే లవ్ చేస్తా అంటూ అఖిల్  చెప్పుకొచ్చాడు. ఇటీవలే అఖిల్  చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తికరంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: