బెల్లంకొండ శ్రీనివాస్ ని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి‌.యాక్టర్లు అన్నాక కొంచెం ఓవర్ యాక్షన్ చెయ్యడం కామన్.. సినిమాల్లో యాక్షన్ సన్నివేశాల్లో చేస్తూ ఉంటారు. అభిమానుల్లో ఊపు తెప్పించడానికి మన హీరోలు ఒక్కోసారి అలాంటి ఓవర్ యాక్షన్ సీన్లు చేస్తుంటారు. వాటిని చూసి అభిమానులు ఆనందిస్తే, నెటిజన్లు విమర్శలు చేస్తుంటారు. అది కామన్‌. కానీ ఆ ‘అతి’ని బుల్లితెర మీద కూడా చేస్తే… దానిని వీర అతి అంటారు. ఇప్పుడు ఆ అతిని మన బెల్లం బాబు చేశాడు. అదేనండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. సంక్రాంతి సందర్భంగా ఓ ప్రముఖ ఛానల్‌లో ఏర్పాటు చేసిన వేడుకకి బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ రావడం జరిగింది.

ఆ ఈవెంట్ లో సరదాగా తాడు లాగే పందెం పెట్టారు. అందులో ఏడుగురు ఒకవైపు, బెల్లంకొండ శ్రీను ఒకవైపు. అదీ ఫ్రేమ్‌. ఆ ఏడుగురు తాడు లాగుతుంటే… మన బెల్లం బాబుగారు మాత్రం  తాడు మీద కాలు వేసి ఆపడం జరిగింది. దానికి చుట్టూ ఉన్నవాళ్లు చప్పట్లు కొట్టడం. ఇదంతా చూసి నెటిజన్స్ అబ్బో అనుకుంటున్నారు. 75 సెకన్ల ప్రోమోలోనే ఇంత దారుణం ఉంటే‌. మరి రెండు గంటల షోలో ఇలాంటి ఇంకెన్ని దారుణాలు  ఉంటాయో చూడాలి మరి.బాలీవుడ్‌ వెళ్లి అక్కడ ఎదో చేద్దాం అనుకుంటున్న సమయంలో ఇలాంటి ‘ఓవర్‌ రియలిస్టిక్‌’ సీన్స్‌ చేసి అభిమానుల ముందు పెడితే బాగుండదేమో బెల్లంకొండ సర్‌.. కాస్త ఆలోచించుకోండి అంటూ నెటిజన్ల సలహాలు ఇస్తున్నారు.

ఇప్పటికే బెల్లం బాబుకు యాక్టింగ్ రాదనీ నెటిజన్స్ ఆడుకుంటున్నారు. ఇంకా ఇలాంటివి చేస్తే ఊరుకుంటారా? ఇంకా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్  గ్రూప్ ని  ఫాలో    అవ్వండి....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: