వార్నీ .... 'క్రాక్' మూవీ టీమ్ నుండి ఈ 'షాక్' అస్సలు ఊహించలేదుగా .....??
ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని, మరోవైపు నిన్న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క సెన్సార్ టాక్ ని బట్టి చూస్తుంటే మూవీ పక్కాగా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నాయి పలు ఫిలిం నగర్ వర్గాలు. ఇక వీటితో పాటు గతంలో రవితేజ, గోపీచంద్ ల కలయికలో తెరకెక్కిన డాన్ శ్రీను, బలుపు సినిమాలు రెండూ కూడా సూపర్ హిట్ కొట్టడంతో తప్పకుండా ఈ మూవీ కూడా సక్సెస్ కొట్టి వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ నమోదు చేయడం ఖాయం అని పలువురు రవితేజ ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా విషయమై మూవీ యూనిట్ ఆడియన్స్ కి ఒకింత స్వీట్ షాక్ ఇచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.
నిజానికి మొదట ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ఈనెల 14న రిలీజ్ చేద్దాం అని భావించారు. అయితే అదే రోజున రామ్ రెడ్ మూవీ, అలానే అంతకముందు రోజైన 13న విజయ్ మాస్టర్, అలానే 15న బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ వంటి సినిమాలు ఉండడంతో తమ సినిమా యొక్క థియేటర్స్ షేరింగ్, కలెక్షన్స్ విషయమై రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని క్రాక్ మూవీ యూనిట్, ఒక్కసారిగా మూవీని ఐదు రోజులు ముందు జరిపి నిన్న ఉదయం రిలీజ్ డేట్ ని జనవరి 9 గా అనౌన్స్ చేసింది. ఒకరకంగా ఇది క్రాక్ మూవీ ఇచ్చిన స్వీట్ షాక్ అని, తప్పకుండా సినిమా రిలీజ్ తరువాత సక్సెస్ కొట్టడం ఖాయం అని పలువురు ప్రేక్షకులు, రవితేజ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.....!!