త్వరలో పెళ్లి.. అమ్మ ఒత్తిడితోనే.. మెగా హీరో క్లారిటీ ఇచ్చేసాడుగా..?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మామకు తగ్గ అల్లుడు గా గుర్తింపు తెచ్చుకున్న సాయిధరమ్ తేజ్  ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరో గా కొనసాగుతున్నాడు. ఇక గత కొంత కాలం నుంచి వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అనే విషయం తెలిసిందే. ఎన్నోసార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైంది.


 ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మంచి టాక్ సొంతం చేసుకోవడంతో మరో విజయం సాయి ధరంతేజ్ ఖాతాలో చేరిపోయింది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా మంచి క్లాసికల్ హిట్ గా నిలిచింది.  అయితే ఈ సినిమాలో సోలో గా ఉండటమే ఎంతో బెటర్ అంటూ చెప్పిన సాయి ధరమ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల సాయి ధరమ్ తేజ్ దీనిపై ఇండైరెక్ట్గా క్లారిటీ ఇచ్చేశాడు.



 ఇటీవలే జీ తెలుగు లో ప్రసారమయ్యే బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో  విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అయితే ఈ షో కి సాయి ధరమ్ తేజ్ ప్రమోషన్ లో  భాగంగా గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే సోలో బ్రతుకే సో బెటర్ అంటూ సినిమాలో చెప్పారు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ ఈ సందర్భంగా సుమ సాయి ధరమ్ తేజ్ ను అడుగుతుంది.. మనం ఎంత స్ట్రాంగ్ గా పెళ్లి చేసుకోకూడదు అని అనుకున్నప్పటికీ మన మదర్స్ ఇంకా స్ట్రాంగ్ గా పెళ్లి చేయాలని అనుకుంటారు అంటూ  సాయిధరమ్తేజ్ సమాధానం ఇస్తాడు.  దీన్ని బట్టి చూస్తే సాయి ధరంతేజ్ కి ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని  లేకపోయినప్పటికీ తన మదర్ ఒత్తిడితో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అన్న టాక్ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: