హాకీ ట్రైనింగ్ తీసుకున్న చైతూ.. ఎందుకో తెలుసా..?

praveen
అక్కినేని వారసుడు నాగ చైతన్య ప్రస్తుతం వరుస గా సినిమా లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హై  స్పీడ్ తో  సినిమాలు చేసుకుంటూ దూసుకు పోతున్నారు.  హిట్టు  ఫ్లాపుల తో సంబంధం లేకుండా వరుస సినిమా లతో దూసుకు పోతున్నాడు నాగ చైతన్య. విలక్షణమైన దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన లవ్ స్టోరీ అనే సినిమా లో నటించిన నాగ చైతన్య.. ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ సినిమా లో నాగ చైతన్య సరసన సాయి పల్లవి నటించింది అన్న విషయం తెలిసిందే.



 ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అక్కినేని నాగచైతన్య. ఇక ఇటీవలే కొత్త చిత్రం థాంక్యూ అనే సినిమాలో నాగచైతన్య నటిస్తున్నాడు.  మనం సినిమా తెరకెక్కించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు విక్రమ్ కే  కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య మొదటి సారిగా హాకీ క్రీడాకారుడు గా కనిపించ బోతున్నారు అన్న టాక్ టాలీవుడ్ లో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ సినిమా క్రీడా నేపథ్యం కాకపోవడం గమనార్హం.



 అయితే కేవలం సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో  మాత్రమే నాగచైతన్య హాకీ క్రీడాకారుడు గా కనిపించబోతున్నారని తెలుస్తోంది.  ఇక ఈ కొన్ని సన్నివేశాల కోసం నాగచైతన్య ఏకంగా హాకీలో శిక్షణ తీసుకున్నారట.  ఇక హాకీ నేపథ్యంలో ఉండే అన్ని రకాల సన్నివేశాలను గతవారం చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన నటించే హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: