మరో అవార్డు అందుకోనున్న సోనూసూద్...!
సినీ ఫీల్డ్ లో తను సంపాదించుకున్న ఆస్తులను మొత్తం నిరుపేదలకు పంచి పెట్టి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శక్తికి మించి సహాయ సహకారాలు అందించిన సోను తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టి పేదలకు సాయం చేశారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతే కాకుండా తెలిసినవారిని మరియు కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ను సంప్రదించి కోవిడ్ కరువు కాలంలో అభాగ్యులకు అండగా నిలవాలని కోరారు. రీల్ లైఫ్ లో విలన్ గా కనిపించిన ఈ నటుడు రియల్ లైఫ్ లో నిజమైన హీరోగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలకు ఆసరాగా నిలబడ్డ సోను సూద్ కు ఎన్నో గౌరవ పురస్కారాలు దక్కాయి.
అయితే ఇప్పుడు మరో అవార్డు ఆయన చేసిన సేవకు గుర్తింపుగా దక్కబోతోంది. 'హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్-2020’ అవార్డు సోను సూద్ కు ఇవ్వబోతున్నారు. డిసెంబరు 30 న ఈ అవార్డును సోను అందుకోనున్నట్లు సమాచారం. ప్రతిష్టాత్మక బాలీవుడ్ ఫెస్టివల్ నార్వే చేత ఈ అవార్డును పొందపోతున్నారట సోను సూద్. అటు పేరు ప్రతిష్టలు, ఇటు ప్రతిష్టాత్మక పురస్కారాలనూ అందుకుంటున్నారు రియల్ హీరో సోనుసూద్. ఈ విధంగా సోనూసూద్ ప్రజలకు చేస్తున్న సేవలకు ఎంత పొగిడినా తక్కువే అవుతుంది.. దేశంలో ఉన్న సంపన్నులు కూడా ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని సహాయ సహకారాలు అందిస్తే ఆయన చేసిన సేవలకు అర్ధం ఉంటుంది.