
షకీలా పై సంచలన కామెంట్స్ చేసిన రీచా చద్దా...
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించిన రిచా చద్దా.. షకీలా క్యారెక్టర్‌పై కీలక కామెంట్స్ చేసింది.కెమెరా ముందు షకీలా రోల్ పోషించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని పేర్కొన్న రిచా.. ఈ సినిమా గురించి పలు విషయాలు వెల్లడించింది. షకీలా పాత్రలో లీనం కావడం కోసం చాలా కష్టపడ్డానని, మళయాలంలో ఆమెకు స్టార్‌డమ్ తెచ్చిన సినిమాల లిస్ట్ తెప్పించుకొని అన్ని సినిమాలను చూసి అనుకరించానని చెప్పుకొచ్చింది. అలాగే ఆమె వ్యక్తిగత జీవితం, వ్యక్తిత్వం గురించి తెలుసుకున్నానని పేర్కొంది.
కెరీర్ పరంగా, కుటుంబం పరంగా నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఎవరి గురించి తప్పుగా మాట్లాడకపోవడం షకీలా మంచి గుణానికి నిదర్శనమంటూ రిచా చద్దా చెప్పింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...