పూజా హెగ్దే ఆ సినిమా కోసం అందుకే రెమ్యూనరేషన్ తగ్గించుకుందట.....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... పూజా హెగ్దే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడమే కాదు భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా దూసుకుపోతుంది.వరుస హిట్లు అందుకుంటూ స్టార్ హీరోస్ కి ఫస్ట్ ఛాయిస్ గా మారింది.వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న బిజీగా ఉన్న పూజా హెగ్డే టాలీవుడ్ తరువాత పూర్తిగా తన ఫోకస్ ను బాలీవుడ్ పైనే పెట్టింది.

అక్కడ హౌజ్ ఫుల్ 4 ద్వారా హిట్ అందుకోవడంతో వరుసగా అవకాశాలు అందుతున్నాయి. సల్మాన్ ఖాన్ కూడా అమ్మడిపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు టాక్. ఇక ఇటీవల బుట్టబొమ్మ ఒక తెలుగు సినిమా కోసం రెమ్యునరేషన్ ను తగ్గించినట్లు తెలుస్తోంది. మినిమమ్ 2కోట్లు డిమాండ్ చేస్తున్న పూజ గుణశేఖర్ శాకుంతలం సినిమా కోసం కొంత తగ్గినట్లు సమాచారం.కథ నచ్చడంతో ఆమె వెంటనే ఒప్పేసుకుందట.

చాలా రోజుల తరువాత గుణశేఖర్ ఒక డిఫరెంట్ స్టోరీతో వస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమా టైటిల్ రోల్ లో పూజా హెగ్డే నటించనుందని సమాచారం. వచ్చే ఏడాది సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో ఒక అగ్ర హీరో కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ వస్తోంది. ఈ సినిమా కనుక మంచి హిట్ అయితే పూజా హెగ్దే కి మంచి పేరు వస్తుంది. అందుకే రెమ్యూనరేషన్ తగ్గించుకుందని సమాచారం. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: