హిట్ కోసం దర్శకుల ఆరాటం !

NAGARJUNA NAKKA
ఇండస్ట్రీ ఎప్పుడూ సక్సెస్‌ వెంటే పరుగులు పెడుతుంది. ఎంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా, సక్సెస్‌లేకపోతే కెరీర్‌ కష్టాల్లో పడుతుంది. ఇండస్ట్రీ కూడా మరిచిపోయే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు కొంతమంది దర్శకులు ఇలాంటి స్టేజ్‌లోనే ఉన్నారు. కంపల్సరీగా హిట్‌ కొట్టాల్సిన స్టేజ్‌లో పడిపోయారు.

ఒకప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్‌ అడ్రస్ శ్రీను వైట్ల. చిరంజీవి, మహేశ్ బాబు లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేశాడు. 'ఢీ, రెడీ, దూకుడు' లాంటి హిట్స్‌తో టాప్‌ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. అయితే 'ఆగడు' తర్వాత వైట్లకి వరుస ఫ్లాపులొచ్చాయి. 'మిస్టర్, అమర్‌ అక్బర్ ఆంటోని' డిజాస్టర్స్‌తో శ్రీను వైట్ల కెరీర్‌ కూడా ప్రశ్నార్ధకంలో పడింది.

శ్రీను వైట్ల పనైపోయిందని, ఒకే రకమైన కథలతో ఆడియన్స్‌ని ఇరిటేట్ చేస్తున్నాడనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఇలాంటి టైమ్‌లో తనకి సూపర్‌ స్టార్డమ్ తెచ్చిపెట్టిన 'ఢీ' సీక్వెల్ మొదలుపెట్టాడు. 'డీ అండ్ డీ-డబుల్ డోస్' పేరుతో సినిమా తీస్తున్నాడు. ఇక స్లంపులోనుంచి బయటపడాలనుకుంటోన్న మంచు విష్ణు కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

'బొమ్మరిల్లు' సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. ఒకే ఒక్క హిట్‌తో టాలీవుడ్‌ని తనవైపు తిప్పుకున్న ఈ దర్శకుడు 'ఒంగోలు గిత్త' తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇక జనాలంతా మర్చిపోతోన్న టైమ్‌లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. లాంచింగ్‌ నుంచి సూపర్‌ బ్లాక్‌బస్టర్‌ కోసం చూస్తోన్న అక్కినేని అఖిల్, ఈ మూవీతో ఆ కోరిక తీరుతుందనుకుంటున్నాడు.

'కందిరీగ' సినిమాతో మాస్‌ హిట్ కొట్టి, ఆ వెంటనే జూ.ఎన్టీఆర్‌ని డైరెక్ట్ చేసిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. అయితే సెకండ్‌ సినిమాకే స్టార్ హీరోని డైరెక్ట్‌ చేసినా, అంచనాలకు తగ్గ రిజల్ట్ అందుకోలేకపోయాడు. 'హైపర్' తర్వాత నాలుగేళ్లపాటు కనిపించలేదు. దీంతో సంతోష్ శ్రీనివాస్‌ పనైపోయిందనే ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి టైమ్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో 'అల్లుడు అదుర్స్' మొదలుపెట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: