ఆహాలో అదరగొట్టబోతున్న డర్టీ హరి సినిమా...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... కరోనా వైరస్ ప్రభావం వల్ల  లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. ఆ లాక్ డౌన్లో  సినిమా థియేటర్లు మూతబడటంతో ఓటీటీ ప్లాట్‌ఫాంలు ప్రేక్షకులకు చేరువయ్యాయి. సినీ ప్రియులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. దీన్ని క్యాష్ చేసుకోవడానికి 100 శాతం తెలుగు కంటెంట్‌తో ‘ఆహా’ ప్లాట్‌ఫాంను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ‘జోహార్’, ‘కలర్‌ ఫొటో’, ‘మా వింతగాధ వినుమా’, ‘ఒరేయ్‌ బుజ్జిగా’ వంటి మంచి సినిమాలతో పాటు సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘సామ్‌ జామ్‌’, వైవా హర్ష హోస్ట్‌ చేస్తున్న ‘తమాషా విత్‌ హర్ష’ వంటి సక్సెస్‌ఫుల్‌ టాక్‌షోలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ‘ఆహా’.ఇక ‘ఆహా’లో అన్‌లిమిటెడ్‌ ఎంటర్‌టైన్మెంట్‌‌ను ఎంజాయ్ చేయాలంటే ఏడాదికి రూ.365 చెల్లించి సబ్‌స్ర్కైబ్ చేసుకోవాలి.

‘ఆహా’ ప్రోమో కోడ్‌ ‘AHA100!’తో వంద రూపాయల డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. ఓటీటీలకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ ఆహా ఇండియాలో తనదైన గుర్తింపు సంపాదించుకుంటూ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రానున్న ఏడాది మరింత ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.ఇక  ‘ఆహా’ లో  ఎరోటిక్‌ థ్రిల్లర్‌ ’ డర్టీ హరి విడుదల అవుతుంది. శ్రవణ్‌ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్‌ కౌర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ తప్ప ఏమీ లేదని అంతా విమర్శించారు.

కానీ, సినిమా విడుదలైన తరవాత విమర్శకుల ప్రశంసలు అందాయి. ఫ్రైడే మూవీస్ యాప్ ద్వారా ఈ సినిమాను విడుదల చేశారు. రూ.120 చెల్లించి ఈ సినిమాను చూసే సదుపాయం కల్పించారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ‘ఆహా’ ద్వారా ఆడియన్స్‌కు మరింత చేరువవుతోంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: