మహేష్ కోసం కూడా సర్వం సిద్దమట .... మొదలెట్టడమే తరువాయి ....??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, మహర్షి సినిమాలతో వరుసగా మూడు సక్సెస్ అందుకొని కెరీర్ పరంగా మంచి జోష్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఇక అతి త్వరలో మహేష్ నటించనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ కు జోడిగా తొలిసారిగా కీర్తిసురేష్ నటిస్తుండగా యువ సంగీత తరంగం తమన్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు.

వాస్తవానికి ఈ పాటికే అమెరికాలో తొలి షెడ్యూల్ జరగవలసిన ఈ  సినిమా అక్కడ ప్రస్తుతం వరుసగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కొద్దిరోజుల పాటు వాయిదా పడింది. అందుతున్న సమాచారం ప్రకారం దీనిని జనవరి రెండో వారంలో ముందుగా హైదరాబాదులో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తోపాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు చేయనున్నారు. కాగా వీటిలో రాజమౌళి దర్శకత్వంలో సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్ నారాయణ నిర్మించనుండగా త్రివిక్రమ్ మూవీని జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎంతో గ్రాండ్ లెవల్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇక అతి త్వరలో త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని మంచి యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ కి జోడీగా ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ నటించనుందని సమాచారం.

ఇక తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో అతి త్వరలో మొదలు పెట్టనున్న త్రివిక్రమ్ అది సగం పూర్తయిన వెంటనే మహేష్ తో కూడా సినిమా ప్రారంభించనున్నారని ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాతో పాటు మహేష్ సినిమా కోసం కూడా పక్కా ఏర్పాట్లు పూర్తయ్యాయని అంటున్నారు మరోవైపు ఇటీవల మహేష్ సినిమాకు సంబంధించిన మిగతా తారాగణం అలానే సాంకేతిక బృందాన్ని కూడా త్రివిక్రమ్ ఎంపిక చేశారట అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మార్చి రెండో వారంలో సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. మరి ప్రస్తుతం ప్రచారమవుతోన్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: