మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్న యువహీరోలు వీరే...?
ప్రజల గుండెల్లో.... గుడి కట్టుకున్నారు మెగాస్టార్ చిరు. తెలుగు సినీ పరిశ్రమకు బ్రేక్ డాన్స్ ను పరిచయం చేశారు చిరు. ఆయన సినీ జీవితంలో ఎన్నో హిట్లు, మరెన్నో బ్లాక్ బస్టర్ లు. అయితే సమంతా హోస్ట్ గా తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” లో ప్రసారమవుతున్న సెలబ్రిటీ టాక్ షో ‘సామ్ జామ్’. కాగా మెగాస్టార్ చిరంజీవి ఈ షోకు రానున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. అయితే ఈ షో..... సందర్భంగా సమంత ‘ మీరు చేసిన సూపర్ హిట్ చిత్రాల్లో ఇప్పటి యువ హీరోలు నటించాల్సి వస్తే.. ఏ హీరోకు ఏ చిత్రం సెట్ అవుతుందో చెప్పండి’ అని అడిగి పెద్ద షాక్ ఇచ్చింది సమంత.
చిరునవ్వుతో సమాధానం చెప్పిన చిరు..... పలువురు హీరోల పేర్లు చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, బన్నీ ల పేర్లు ప్రస్తావించగా.... ఏ సినిమాలో ఎవరు హీరో గా చేస్తే బాగుంటుంది అన్నది..ఈ డిసెంబర్ 25న ‘ఆహా’లో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమ్ కానున్న మెగా ఎపిసోడ్ ఫుల్ గా చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి చిరు మెచ్చుకున్న ఆ హీరోలెవరో తెలియాలంటే... ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. అయితే త్వరలో ఆచార్య మూవీ పూర్తి చేసి మన ముందుకు రానున్నారు చిరంజీవి.