సంక్రాంతి బుల్లోడు రామ్..!

NAGARJUNA NAKKA
వద్దామా? వద్దా? ఓటీటీనా? థియేటరా? ఎటూ తేల్చుకోలేకపోయాడు రామ్‌. ఈ కన్‌ఫ్యూజన్‌ నుంచి ఎట్టకేలకు బయటపడి... ముందు అనుకున్నట్టు థియేటర్స్‌లోనే వస్తున్నాడు. రామ్‌ నటించిన రెడ్‌ సంక్రాంతికి ముస్తాబవుతోంది.

ఇస్మార్ట్‌ శంకర్‌ హిట్‌తో ఫామ్‌లోకి వచ్చిన రామ్‌పై కరోనా నీళ్లు చల్లింది. పనిలో పనిగా మరో హిట్‌ కొట్టేయాలని తమిళ హిట్ తడమ్‌ రీమేక్‌తో ముందుకొచ్చాడు. రెడ్‌ పేరుతో తెరకెక్కిన ఈ మూవీకి కిషోర్‌ తిరుమల దర్శకుడు. ఏప్రిల్‌ 9న రావాల్సిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను కరోనా అడ్డుకుంది. నాని నటించిన వి మూవీ  ఓటీటీలో రిలీజ్ కావడంతో.. రెడ్‌ కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్‌లో వస్తుందని ఊహించారు.  అయితే ఓటీటీలో రిలీజ్‌ చేయడం రామ్‌కు ఇష్టం లేదు. దీంతో థియేటర్స్‌లోనే వస్తామని రామ్‌ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు.

రెడ్‌ను బిగ్‌స్క్రీన్‌మీద చూస్తేనే థ్రిల్‌గా ఉంటుందని ముందు నుంచీ చెప్పుకొచ్చాడు రామ్‌. ఆ మాటకే కట్టుబడి సంక్రాంతికి రిలీజ్‌ అంటూ.. రెండు నెలల క్రితమే ఎనౌన్స్ చేశారు. అయితే.. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ తో వర్కవుట్‌ కాదని.. జనాలు థియేటర్స్‌కు వస్తారా రారా అన్న డైలమా నిర్మాతను కన్ఫ్యూజన్‌లో పడేసింది. సంక్రాంతి రేసునుంచి రెడ్‌ తప్పుకుందని.. జనవరి 26న వస్తుందంటూ వార్తలొచ్చాయి. ఎట్టకేలకు డేట్‌ ఎనౌన్స్‌ చేయకపోయినా.. సంక్రాంతికి రెడ్ వస్తోందంటూ... సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు ఈ ఎనర్జిటిక్‌ హీరో.

కరోనా పుణ్యమా అని.. సమ్మర్‌.. దసరా.. దీపావళి వంటి సినిమా పండగలన్నీ సందడి లేకుండానే వెళ్లిపోయాయి. సంక్రాంతి పరిస్థితి కూడా ఇంతే  అనుకున్నారు. అయితే.. మాస్‌రాజా డేర్‌ చేసి.. జనవరి 14న రిలీజ్‌ అంటూ.. డేట్‌తో సహా ప్రకటించాడు. క్రాక్‌ ఇచ్చిన ఇన్‌స్పిరేషనో.. ఏమోగానీ.. రెడ్ కూడా రెడీ అయింది. మరోవైపు మాస్టర్‌ డబ్బింగ్‌  కూడా సంక్రాంతికే వస్తోంది. మరి సంక్రాంతి రేసులో వస్తామని ముందే చెప్పిన  నితిన్‌ రంగ్‌దే.. అఖిల్‌ మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచులర్‌ పరిస్థితి ఏమిటో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: