తమన్నా సిటీ మార్ మూవీ ఫస్ట్ లుక్ వైరల్...!
అయితే ఈ చిత్రం కూడా అలాంటి విజయాన్నే సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. కాగా ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా... భూమిక కీలక పాత్రను పోషిస్తున్నారు. మణి శర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. కరోనా కారణంగా బ్రేక్ పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కబడ్డీ కోచ్ గా కనిపించనున్నారు గోపీచంద్..... అలాగే హీరోయిన్ తమన్నా కూడా కబడ్డీ కోచ్ జ్వాల రెడ్డి పాత్రలో కనిపించనున్నారు. అయితే సోమవారం తమన్నా పుట్టినరోజు సందర్భంగా సిటీ మార్ చిత్రం లో తమన్నా లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. తమన్నా కబడ్డీ కోచింగ్ డ్రెస్ లో మీ లుక్ అదుర్స్ అంటూ గంతు లేస్తున్నారు అభిమానులు. సోమవారం సెట్లో తమన్నా పుట్టిన రోజును సెలబ్రేట్ చేసి మిల్కీ బ్యూటీని సర్ప్రైజ్ చేసింది చిత్రబృందం. మరోవైపు ఆమె అభిమానులు కూడా పెద్ద ఎత్తున విషెస్ తెలియజేస్తూ సంతోషించారు. ఈ సినిమా అయినా గోపి చంద్ కి విజయాన్ని ఇవ్వాలని అభిమానాలు కోరుకుంటున్నారు. దీని విడుదల తేదీ, మొదలైన వివరాలను ఇంకా ప్రకటించలేదు.