ఎన్టీఆర్, రామ్ చరణ్ పరిస్థితి ఏంటంటే..!
ఎన్టీఆర్ సినిమా వచ్చి రెండేళ్లు దాటింది. 2018 దసరాలు అరవింద సమేత వీర రాఘవతో వచ్చాడు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం ఇంకెన్ని నెలలు వెయిట్ చేయాల్సి వస్తుందో చూడాలి. గ్యాప్ విషయంలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కాస్త బెటర్. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ 2018లో వస్తే రామ్ చరణ్ 2019లో వినయ విధేయ రామతో వచ్చాడు. ట్రిపుల్ ఆర్ తప్ప మరో సినిమా చేయడం లేదు. మరి ఆర్ఆర్ ఆర్ ముహూర్తం ఎప్పుడో గానీ ఈ స్టార్స్ కు మాత్రం గ్యాప్ బాగా పెరిగిపోతోంది.
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకున్న బన్నీ అలవైకుంఠపురంతో వచ్చి అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నటించాల్సిన పుష్ప మూవీని కరోనా అఢ్డుకుంది. ఈ మధ్యనే రెగ్యులర్ షూటింగ్ లోకి వెళ్లిన పుష్ప ఏ సీజన్ లో వస్తుందో గ్యారెంటీ లేకపోయినా.. 2021లోనే వస్తాడు.
ఇక సీనియర్ హీరోలు కూడా గ్యాప్ లో పడిపోయారు. చిరంజీవి సైరా రిలీజ్ అయి ఏడాది దాటింది. 2021లో ఆచార్య రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు. వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున కూడా దాదాపు రెండేళ్ల తర్వాత కనిపిస్తారు. హీరోలకు ఫ్లాప్ లు వస్తే హిట్ కథ కోసం గ్యాప్ తీసుకుంటారు. కానీ ప్రస్తుతం అందరికీ కరోనా గ్యాప్ తీసుకొచ్చింది.
మొత్తానికి కొందరు హీరోలు కావాలని గ్యాప్ తీసుకుంటే.. మరికొందరి హీరోల సినీ లైఫ్ లో కరోనా పెద్ద బ్రేక్ ఇచ్చేసింది. ఇంటికే పరిమితం చేసి.. సినీ అభిమానులను డిసప్పాయింట్ చేసింది.