
ఈ మోనాల్ ఇక మారదా అని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. మళ్ళీ ముద్దులు...
గత ఆదివారం నాటి 14వ ఎలిమినేషన్‌లో మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ కాగా.. మళ్లీ శుక్రవారం వచ్చేసరికి బిగ్ బాస్ హౌస్‌లో దర్శనం ఇచ్చేసింది. ఎంట్రీ ఇవ్వడమే కాదు.. మోనాల్ లేక విరహవేదన అనుభవిస్తున్న అఖిల్‌కి ఐ లవ్ యూ అంటూ బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లేలా చెప్తోంది.. అఖిల్‌ని ముద్దులతో ముంచెత్తుతోంది. వీరిద్దరి మధ్యలో బిగ్ బాస్ మిర్రర్‌ని అడ్డుగా పెట్టారు కానీ.. లేదంటే హౌస్‌లో ఉన్నప్పుడు జరిగిన రొమాన్స్‌కి రెట్టింపు చేసేట్టుగానే కనిపించారు.
ప్రోమో విడుదల చేయగా.. మొదటిగా బిగ్ బాస్ దత్త పుత్రికగా పేరొందిన మోనాల్ గజ్జర్‌కే తొలి ప్రాధాన్యత లభించింది. మిర్రర్ రూంలో మోనాల్ వచ్చి నిలబడగా.. అఖిల్ పరుగు పరుగున వచ్చి మోనాల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ కిస్‌ని తీసుకున్నాడు. ఇద్దరి మధ్యలో మిర్రర్ ఉన్నా.. ఇద్దరూ హగ్ బాగానే ఆస్వాదిస్తున్నారు. ఇక అఖిల్ నెంబర్ వన్ అంటూ మొదటి నుంచి పాడినా పాటనే పాడుతూ ఉంది మోనాల్.ఇక మోనాల్ ఓవర్ యాక్టింగ్, ముద్దులు, హగ్గులు చూసిన నెటిజన్స్ మోనాల్ నీకెప్పుడు ఇదే పనా? నువ్వింకా మారవా?.. అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...