
సినిమా పరిశ్రమపై సంచలన కామెంట్స్ చేసి ఎమోషనల్ అయినా హాట్ బ్యూటీ...
వయసు పైబడిన హీరోలంతా యంగ్ హీరోయిన్స్‌తో నటించడం వల్లనే వారి వారి కెరీర్ ఇంకా కొనసాగుతోందని, అది హీరోల గొప్పేమీ కాదని చెప్పుకొచ్చింది.వయసు మళ్లిన హీరోయిన్లను దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరూ కథలు రాయరు కానీ.. వయసు పైబడిన హీరోల కోసం మాత్రం పుట్టలుపుట్టలుగా కథలు రాసి వారి డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటారంటూ సినీ పరిశ్రమపై విమర్శలు గుప్పించింది దియా. 50 ఏళ్లు పైబడిన హీరో 19 ఏళ్ల వయసున్న హీరోయిన్ పక్కన నటించడం విడ్డూరంగానే గాక చూడటానికే వింతగా ఉందని పేర్కొంది.
వయసు పైబడినా సరే పెద్ద హీరోలకు ఛాన్సులిచ్చే దర్శకనిర్మాతలు.. ఏజ్ ఎక్కువగా ఉన్న మహిళలను మాత్రం పక్కన పెడుతుండటం చాలా దురదృష్టకరం అంటూ ఆవేదన చెందింది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి....