అనుపమ వెంట 8 మిలియన్ ఫాలోవర్స్.. అమ్మడు ఏం చేసిందో తెలుసా..?

shami
మళయాళ ప్రేమం సినిమాతో మెప్పించిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో మొదటి సినిమా అఆ చేసినా ఆ తర్వాత ప్రేమం రీమేక్ లో కూడా తన పాత్రతో మెప్పించింది. యువ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరో ఛాన్సులను అందుకోవడంలో విఫలమైంది. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సరే అనుపమ పరమేశ్వరన్ తన సోషల్ మీడియా ఫాలోవర్స్ ను మాత్రం భారీగా పెంచుకుంటుంది.

స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో అనుపమ ఇన్ స్టాగ్రాం లో 8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన ప్రతి అప్డేట్ ఇన్ స్టాగ్రాం లో ఉంచుతూ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను అలరిస్తుంది అనుపమ పరమేశ్వరన్. ట్విట్టర్ లో కేవలం 2.3 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్న అమ్మడు ఇన్ స్టాగ్రాం లో మాత్రం 8 మిలియన్ ఫాలోవర్స్ దాకా సంపాదించింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఛాన్సులు అందుకుంటున్న అనుపమ కెరియర్ లో అర్జెంట్ గా ఓ సూపర్ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది.

లాస్ట్ ఇయర్ రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్న అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులను చేస్తుంది. రాం, సాయి ధరం తేజ్ లాంటి హీరోల పక్కన నటించిన అనుపమ స్టార్ ఛాన్సులను మాత్రం అందుకోలేకపోతుంది. తప్పకుండా అమ్మడికి భారీ సినిమాల ఆఫర్లు వచ్చి కెరియర్ మళ్లీ గాడిలో పడాలని ఆశిద్దాం. ఇన్ స్టాగ్రాం లో తనకు వచ్చిన 8 మిలియన్ ఫాలోవర్స్ కు సంతోషంగా అనుపమ తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అందరికి ఐ లవ్యూ అని చెబుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: