నిర్మాతగా మారుతున్న మెగాస్టార్ కూతురు...
ఇక ఇప్పటికే "షిట్ హ్యాపెన్స్" సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని సమాచారం అందుతుంది. ఫీల్ గుడ్ డ్రామాగా తెరకెక్కున్న ఈ సినిమాలో హీరో పాత్ర పక్కింటి కుర్రాడిలా ఉంటుందంటున్నారు. కథ బాగా నచ్చడంతో సుస్మిత… ఫైనల్ డెసిషన్ కోసం తండ్రి చిరంజీవి ని అడిగిందట. ఆయన కూడా పచ్చజెండా ఊపడంతో సినిమా ఫైనల్ అయ్యిందని సమాచారం. ఆ తర్వాత సత్యానంద్ దగ్గరకు కథ తీసుకెళ్లడం, ఆయన మార్పులు చేసి ఇవ్వడం కూడా జరిగిపోయిందని సమాచారం అందింది.
ఇక ఈ సినిమాని అన్ని విధాలుగా అనుకున్నట్లుగా రెడీ చేసి ఫిబ్రవరి నుంచి తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఫ్యాషన్ డిజైనర్‌గా సినిమాల్లో తనేంటో నిరూపించుకున్న సుస్మిత నిర్మాతగా ఎంతగా రాణిస్తుందో చూడాలి. అన్నట్లు క్రిస్‌మస్ సందర్భంగా ‘షూట్ ఔట్…’ సిరీస్ జీ5లో ప్రసారం కాబోతున్న విషయం తెలిసిందే.మరి చూసేందుకు రెడీ అవ్వండి మరీ.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...