టాలీవుడ్ నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి అంతకముందు బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన మహేష్, ఆ వయసులోనే తన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇక తొలి సినిమా రాజకుమారుడుతో భారీ సక్సెస్ ని అందుకున్న మహేష్ బాబు ఆ తరువాత నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగారు.
అనంతరం కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కొట్టిన సూపర్ స్టార్ మహేష్, అనతికాలంలోనే ఎందరో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనడంతో పాటు తండ్రి కృష్ణ కు తగ్గ తనయుడిగా గొప్ప పేరు దక్కించుకున్నారు. ఇక అతి త్వరలో ఆయన నటించనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట సెట్స్ మీదకు వెళ్లనున్న విషయం తెలిసిందే. మహేష్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు మూవీ తో భారీ సక్సెస్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్, ఈ సర్కారు వారి పాటతో కూడా మరొక సక్సెస్ అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇకపోతే అసలు మ్యాటర్ ఏమిటంటే, ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో అందుబాటులో ఉంటూ తన సినీ, వ్యక్తిగత విషయాలు పంచుకునే అలవాటున్న మహేష్, ఈ ఏడాది అత్యధిక మంది ట్విట్టర్ లో ట్వీట్ చేసిన మూవీ సెలబ్రిటీ గా టాప్ వన్ ప్లేస్ దక్కించుకుని గొప్ప రికార్డు దక్కించుకున్నారు. అయితే ఆయన తరువాత రెండవ స్థానాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. మరోవైపు అత్యధికులు ట్వీట్ చేసిన మూవీ గా పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్ రెండవ స్థానాన్ని దక్కించుకోగా మహేష్ బాబు, సర్కారు వారి పాట నాలుగవ స్థానంలో నిలిచింది. ఈ విధంగా సూపర్ స్టార్ తన సత్తా ని చాటారు.....!!