మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..!

N.ANJI
బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగో సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇక గ్రాండ్ ఫినాలేకు సమయం ఆసన్నమైంది. ఫినాలేకు చేరుకునే కంటెస్టెంట్లు శనివారం సోహెల్ ఫైనల్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇక ఆదివారం ఇంకా ఎవరు వెళ్లనున్నారో తేలిపోనుంది. ఫినాలేకు వెళ్లే టాప్ 5 కంటెస్టెంట్స్‌ని రివీల్ చేసుకుంటూ వెళ్తా అంటూ నాగార్జున శనివారం ఎపిసోడ్ లో చెప్పారు. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో కొంత మంది ఫైనలిస్ట్‌లను నాగార్జున ప్రకటిస్తారు. అలాగే, ఈవారం ఎలిమినేట్ అయ్యే ఇంటి సభ్యుడిని ఆదివారం ప్రకటించే అవకాశం ఉంది.

అయితే బిగ్ బాస్ షోలో చివరికి వచ్చేసరి రసవత్తరంగా మారింది. ఈ సమయంలో కూడా ఉన్నవారి మధ్య టాస్కులే పెడుతున్నారు నిర్వాహకులు. తాజాగా కంటెస్టెంట్లు అందరూ ఇంటి సభ్యులందరిపై తొలి అభిప్రాయం..చివరి అభిప్రాయం చెప్పాలని చెప్పాలని టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలో మళ్లీ మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన విభేదాలను మరోసారి పైకిలాగే ప్రయత్నం కనిపించింది. అలా అభిజిత్ తన మనసులోని మాటలు చెప్పుకొచ్చాడు.

అయితే అభిజిత్ ‌కి హారిక,  అరియానాలు, సోహెల్ నచ్చారు. అఖిల్, మోనాల్‌లు నచ్చలేదు. అయితే అరియానా, సోహెల్, హారికలపై ఫస్ట్, లాస్ట్ ఇంప్రెషన్ గురించి మంచిగానే చెప్పుకొచ్చాడు. ఇక్కడి వరకు అంతా ఓకే.మోనాల్ మీద కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ గురించి వివరించాడు. మోనాల్ మొదట బాగా హైపర్ అనిపించింది.  మధ్యలో ఇద్దరికి బాగానే రిలేషన్ కుదిరింది. కానీ చివరకు ఆమె నేను, రెండు డిఫరెంట్ మెండ్‌సెట్స్ కలిగిన వాళ్లమని అర్థమైనట్లు చెప్పుకొచ్చాడు. అఖిల్‌ను ఫస్ట్ టైమ్ చూసినప్పుడు మంచి వాడు.. కూల్ ఫెల్లో అనుకున్నాను. ఇప్పుడు కూడా అంతే. అయితే మోనాల్ అనే చాప్టర్‌ను తీసేస్తే అఖిల్ తనకు చాలా మంచి స్నేహితుడు అని చెప్పుకొచ్చాడు. ఆ ఒక్క టాపిక్ వల్ల అఖిల్, తాను దూరమయ్యామంటూ వివరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: