ప్రభాస్ కు షాక్ ఇచ్చిన.... సోనూసూద్..!
‘2020 సంవత్సరంలో ప్రపంచంలో టాప్ 50 ఏషియన్ సెలబ్రిటీల’ జాబితాలో ఆయన ఏకంగా మొదటి స్థానం చేరుకున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఈ ఏడాది పలు సంస్థలు నిర్వహించిన పాపులర్ సెల్రబెటీల జాబితాలో మరియు పలు వెబ్ సైట్ల సెర్చింగ్ జాబితాలో కూడా సోనుసూద్ పేరు టాప్ లో ఉండటం విశేషం. దీన్ని బట్టి ఆయన పాపులారిటీ ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ప్రముఖ బ్రిటన్ మీడియా సంస్థ పేర్కొన్న ఏషియన్ పాపులర్ సెల్రబెటీల జాబితాలో సోనూసూద్ అగ్రస్థానంలో నిలిచాడు. బాహుబలి సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ను సైతం దాటి నెంబర్ వన్ గా నిలిచి ఆశ్చర్యాన్ని కలుగ చేశారు సోను సూద్.
అంతే కాదు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా రికార్డును సైతం బ్రేక్ చేసి నెంబర్ వన్ గా నిలిచారు. లాక్డౌన్ సమయంలో ఆయన ప్రదర్శించిన దాతృత్వం దేశ విదేశాల్లో మారుమోగుతోంది. సోనుసూద్ అభిమానులు సైన్యం అంతకంతకూ పెరిగిపోతోంది. రీల్ లైఫ్ లో విలన్ పాత్రలు చేసినా రియల్ లైఫ్ లో మాత్రం పేదల హీరో గా వెలిగిపోతున్నారు సోనుసూద్. సమాజంలో ఎంతోమంది సంపన్నులు ఉన్నప్పటికీ పేదలకు ఇవ్వాలి అనే ఒక మంచి మనసు మాత్రం సోను సూద్ కు ఉండడం చాలా మంచి విషయం. ఈయనని చూసి అయినా మరింతమంది ముందుకు రావాలని ఆశిద్దాం.