నటించండయ్యా... అంటే ఎస్కేప్ అవుతున్నారు..!
కోలీవుడ్ ఆర్టిస్ట్ లకు తోపులనే ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ రావడానికి, ఇవ్వడానికి మిగిలిన సౌత్ పరిశ్రమలే కారణమనే మాట కూడా ఉంది. తాము చేసిన సినిమాలకు మంచి పేరు వస్తే..ఆ ఇమేజ్ వారిని ఎక్కడో తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంటుంది.
గత కొంతకాలంగా కోలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు అంచనాలకు మించి వచ్చిన క్రేజ్ వారిని సైడ్ ట్రాక్ లోకి వెళ్లేలా చేస్తుంది.
తాజాగా అరవింద్ స్వామి, మాధవన్ లు తెలుగులో ప్రెస్టీజియస్ ఫిలింస్ లో యాక్ట్ చేయమంటే చేయము పో అన్నారు. దానికి వారు ఒక్క కారణం కూడా చెప్పలేదు. ఇప్పటికి మేము చేసిందే ఎక్కువ అన్న ఫీలింగ్ లోనే వారు ఉన్నారు. ధృవతో అరవింద్ స్వామి.... సవ్యసాచి,నిశ్శబ్ధంలతో మాధవన్ లు ఈ విషయంలో మనకు చుక్కలు చూపించారు. దీంతో వీరిద్దరితో ఇక పెట్టుకోవడం వేస్ట్ అనుకున్నారు.
తాజాగా సైరా, ఉప్పెనలతో విజయ్ సేతుపతి కూడా అలాంటి పనే చేశాడు. రీసెంట్ గా మనోడు బిజీ షెడ్యూల్ లో ఉండడంతో బాలీవుడ్ ఆఫర్ లాల్ సింగ్ చద్దాను వదలుకున్నాడు.అలాగే పుష్పను కాదనుకున్నాడు.దీంతో విజయ్ సేతుపతి మెగా కాంపౌండ్ తో ఇక సినిమాలు చేసింది చాలనుకుంటున్నాడా లేక నిజంగానే కాల్షీట్స్ లేకపోవడంతో సినిమాలు చేయడం లేదో తెలియడం లేదు.ఏది ఏమైనా తమిళ ఆర్టిస్ట్ లు వరుసబెట్టి సినిమాలు వదులుకోవడం టాక్ ఆఫ్ ది సౌత్ సినిమా అయింది.