ఆమె రాకతో దర్శకుడి ముఖంలో వెలుగులు..!
ఆర్‌ఆర్‌ఆర్‌లో రామ్‌చరణ్‌కు జోడీగా అలియాను ఏడాది క్రితమే ఎంచుకున్నాడు జక్కన్న. సీత పాత్ర పోషిస్తున్న అలియా.. ఆర్ఆర్‌ఆర్‌తో సౌత్‌లోకి అడుగుపెడుతోంది. హైట్ తక్కువైనా.. పెర్‌ఫార్మెన్స్‌తో.. ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇట్టే ఆకట్టుకునే.. అలియా అయితేనే సీత పాత్రకు బాగుటుందనుకున్నాడు రాజమౌళి. బాహుబలి వంటి వండర్‌ను క్రియేట్ చేసిన రాజమౌళి అడగడం ఆలస్యం.. భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నా.. డేట్స్ ఇచ్చేసింది అలియా.
ముందుగా అలియా ఇచ్చిన డేట్స్‌ను రాజమౌళి యూజ్ చేసుకోలేకపోయాడు. అనుకున్న రెండు షెడ్యూల్స్ వాయిదాపడడంతో.. రెండేళ్లు గడిచిపోయింది. అజయ్‌దేవ్‌గణ్.. హాలివుడ్ నటీనటులు ఒలీవా మోరిస్.. రే స్టీవెన్‌సన్.. ఎలిసన్ డూడీ ఆల్రెడీ షూట్‌లో పాల్గొన్నారు. అందరికంటే చివరిగా ఎంట్రీ ఇచ్చిన నటి మాత్రం అలియానే.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత అలియా ట్రోలింగ్‌కు గురైంది. సంజయ్‌దత్‌తో కలిసి నటించిన సడక్2 ట్రైలర్ బాగానే వున్నా.. అలియాపై కోపంతో రికార్డు స్థాయిలో డిస్ లైక్స్ చేశారు. ఈ పరిణామాలతో అలియా ఆర్‌ఆర్‌ఆర్ నుంచి తీసేశారన్న టాక్ కూడా వినిపించింది. అయితే.. ఇందులో నిజం లేదని.. ఆమెతో దిగిన స్టిల్స్‌తో నిరూపించాడు జక్కన్న. ఆమెకు స్వాగతం పలుకుతూ.. ఆమెతో దిగిన ఫొటోలు షేర్ చేసింది నిర్మాణ సంస్థ డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్.
మొత్తానికి ఆర్ఆర్ఆర్ సెట్స్ లోకి అలియా భట్ వచ్చి చేరింది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలైన రెండేళ్ల తర్వాత ఆమె రాకతో రాజమౌళి ముఖంలో వెలుగులు నిండాయి. రామ్ చరణ్ కు జోడీగా ఆమె నటించనుంది. అయితే ఈ సందర్భంగా అలియాతో దిగిన ఫోటోలను రాజమౌళి ఇప్పటికే షేర్ చేయడంతో సినీజనాల్లో ఆసక్తి నెలకొంది.